రక్తానికి రక్తం: అమితాబ్‌కి యూఎస్ కోర్టు నోటీసులు

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు నోటీసులు జారీచేసింది. 1984 అల్లర్ల కేసులో అమితాబ్ బచ్చన్ పై ఆరోపణలు రావడంతో లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అమితాబ్ బచ్చన్ పై ఆరోపణలు వెలువడ్డాయి.

'బ్లడ్ ఫర్ బ్లడ్ ' నినాదాలు చేశారని అమితాబ్ పై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిక్కుల ఫిర్యాదుతో అమితాబ్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ‘రక్తానికి రక్తం' అంటూ నాడు అమితాబ్ బచ్చన్, సిక్కుల ఊచకోతను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Amitabh Bachchan summoned by US court over 1984 anti-Sikh riots

దీనిపై ‘సిక్స్ ఫర్ జస్టిస్' అనే అమెరికా మానవ హక్కుల సంస్థ సభ్యుడు గురు పత్వంత్ పన్నున్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా లాస్ ఏంజెలిస్ కోర్టు తాజాగా ఈ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లకు జవాబిచ్చేందుకు కోర్టు, అమితాబ్ బచ్చన్ కు 21 రోజుల గడువిచ్చింది. నాటి అమితాబ్ వ్యాఖ్యలు అల్లర్లకు ఆజ్యం పోశాయని సిక్కులు ఆరోపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X