twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమితాబ్‌కు చేదు అనుభవం.. సొంతిల్లు జాల్సా ముందు బాధితుల ధర్నా

    |

    ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మంచి ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్‌ను మరోలా అర్థం చేసుకున్న పర్యావరణ ప్రేమికులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఆయన ఇంటి ముందే నిరసన చేపట్టారు. అడవులు తోటల నుంచి రావంటూ ఎద్దేవా చేశారు.

    మెట్రో సౌకర్యం.. వేగం.. కాలుష్య రహితం

    అసలు అమితాబ్ ట్విట్టర్‌ వేదికగా ఏమన్నారంటే.. నా స్నేహితుడు ఒకరు మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో తన కారులో కాకుండా మెట్రోలో ప్రయాణించాడు. తిరిగి వచ్చాక.. మెట్రోలో ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉందని, వేగంగా గమ్యానికి చేరుకున్నానని వివరించాడు. కాలుష్యాన్ని అరికట్టడానికి మెట్రోనే పరిష్కారం. ఎక్కువగా చెట్లను పెంచండి. నేను నా తోటలో చెట్లు పెంచుతున్నాను. మరి మీరో? అని వ్యాఖ్యానించారు.

    తోటలో చెట్లు పెంచితే అడవులవుతాయా?

    తోటలో చెట్లు పెంచితే అడవులవుతాయా?


    తన ట్వీట్ కాలుష్యంపై జనాలకు అవగాహన కలిగిస్తుందని.. కాలుష్యం వచ్చే వాహనాలకు బదులు మెట్రోను ఆశ్రయిస్తారని అమితాబ్ భావించారు. అయితే. అలా జరగలేదు. తోటలో చెట్లు పెంచడం ఏంటంటూ పర్యావరణ ప్రేమికులు, పలువురు యువకులు అమితాబ్‌పై మండిపడ్డారు. తోటలో చెట్లు పెంచడం ద్వారా అడవులను సష్టించలేమంటూ అమితాబ్ నివాసమైన జల్సా ముందు కొంతమంది యువతీయుకులు నిరసన చేపట్టారు.

    ముంబై మెట్రో హ్యాపీ..

    అయితే, ముంబై మెట్రో నుంచి మాత్రం అమితాబ్‌కు సానుకూల స్పందన వచ్చింది. మెట్రో ప్రాధాన్యతను గుర్తించినందుకు ధన్యవాదాలు అంటూ ముంబై మెట్రో రైల్ ఎండీ అశ్విని భిడే ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మరింతగా తమ సేవలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

    అమితాబ్ జీ ఏం చెబుతున్నారు??

    అశోక్ పండిట్ అనే మరో సినీ దర్శకనిర్మాత కూడా అమిత్ బచ్చన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మెట్రోను సపోర్ట్ చేయడం ద్వారా ఆరేలోని 2700 చెట్లను తొలగించే కార్యక్రమానికి మీరు మద్దతుగా నిలుస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. అభివద్ధి అనేది పర్యావరణానికి హాని కలిగిస్తే మానవ జీవనం కూడా కష్టతరమవుతుందని అన్నారు.

    చెట్లను నరికివేసేందుకు మద్దతు ఇస్తున్నారా?

    చెట్లను నరికివేసేందుకు మద్దతు ఇస్తున్నారా?

    ముంబైలో కొన్ని ప్రదేశాల్లో ఇంకా మెట్రో అమల్లోకి రాలేదు. ఆ ప్రాంతాల్లో మెట్రో నిర్మించాలంటే ఆరే ప్రాంతంలోని 27వేల చెట్లను నరికేయాలని బీఎంసీ ప్రకటించింది. మెట్రో పనుల కోసం చెట్లను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే, విషయం తెలిసిన పర్యావరణ ప్రేమికులు, సామాన్యులు, ప్రముఖులు దీన్ని వ్యతిరేకించారు. ప్రాణవాయువును అందించే వేల చెట్లను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో మెట్రో అవసరాన్ని, ప్రాధాన్యతను అమితాబ్ చెప్పడంతో పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ఈ చెట్లను నరికివేసేందుకు అమితాబ్ మద్దతు ఇస్తున్నారా? అంటూ మండిపడ్డారు.

    English summary
    The controversy surrounding the metro car shed in Aarey is reaching a feverish pitch. Yesterday, Amitabh Bachchan's tweet in favour of the metro, did not go down well, as he said that metro was a faster, convenient and efficient mode of transport.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X