twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమా సూపర్... తెలుగులో బిగ్‌'బి' ట్వీట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు తెలుగు మాట్లాడటం, రాయటం రాదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తన తెలుగు అభిమానులందరినీ ఆశ్యర్య పరుస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసారు. ఎలా నేర్చుకున్నారో తెలియదు కానీ ఆయన సంపూర్ణంగా తెలుగు నేర్చుకోలేదని స్పష్టం అయింది.

    "ఆంధ్రలో నా బాగా కోరుకునేవారుకు... నా ప్రేమ మరియు ప్రేమ... ఒక మహేష్ బాబు చిత్రం చూడటానికి వెళ్లి.. సూపర్.. !" అంటూ ట్వీట్ చేసారు. ఆయన వ్యాఖ్యల్లోని అర్థం.....'నా బాగు కోరుకునే వారు ఆంధ్రలో చాలా మంది ఉన్నారని తెలుసు. నా ప్రేమను వారికి పంచుతాను. నేను మహేష్ బాబు సినిమా చూడటానికి వెళ్లాను. అది సూపర్ గా ఉంది.'ఒక్క తెలుగులోనే కాదు...తమిళం, హిందీ, రష్యన్, అరబిక్ బాషల్లో కూడా బిగ్ బి ట్వీట్ చేసి ఆయా భాషలు మాట్లాడే అభిమానులను ఆశ్చర్య పరిచారు.

    అమితాబ్ సినిమాల విషయానికొస్తే.. బిగ్ బి త్వరలో 'టైటానిక్‌' హీరో లియోనార్డో డికాప్రియో తో కలసి నటించబోతున్నారు.డికాప్రియో ప్రధాన పాత్రలో నటించే చిత్రం 'ది గ్రేట్‌ గాట్స్‌బీ' చిత్రంలోకీ రోల్ కి అమితాబ్ ని ఎంపిక చేసారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే ఈ చిత్రం త్రీడీ సినిమా. ఇస్లా ఫిషర్‌ హీరోయిన్ గా చేస్తోన్న ఈచిత్రంలో మేయర్‌ వుల్ఫ్‌షీమ్‌ అనే పాత్రలో ఆయన కనిపిస్తారు. ఈ చిత్రానికి బజ్‌ లహ్రమన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మే 10, 2013లో ఈచిత్రం విడుదల కానుంది. అమితాబ్ గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ప్రపంచంలోని గొప్ప నటుల్లో అమితాబ్‌ ఒకరు. ఆయన నా చిత్రంలో నటించేందుకు అంగీకరించడం ఎంతో ఆనందంగా ఉంది. అమితాబ్‌ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. భారతీయ చిత్రాలపై అభిమానం ఏర్పడటానికి ఆయన నటించిన 'షోలే' చిత్రమే కారణం'' అన్నారు.

    English summary
    Amitabh Bachchan Telugu tweets. He posted, "Andhralo naa baagu korukunevaruki naa prema mariyu prema.. oka Mahesh Babu chitram choodataniki velli.. super..(sic)"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X