Amitabh Bachchan: రెండోసారి బిగ్​బీ అమితాబ్​కు కరోనా.. ఆయన ఏమన్నారంటే?

కరోనా రక్కసి కారణంగా సినీ ఇండస్ట్రీ రెండేళ్లు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఎన్నో నష్టాలను చవిచూసింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పూర్వ వైభవం వచ్చేందుకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్​, మాలీవుడ్​ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కరోనా మహామ్మారి సినీ ప్రముఖులను పలకరిస్తూ కలవర పెడుతోంది. అయినా వారు దానికి ధైర్యంగా ఎదురు నిలబడుతున్నారు. తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​.

బాలీవుడ్​లో అగ్ర హీరోగా ఎదిగిన స్టార్​ అమితాబ్ బచ్చన్​. ఆయన్ను అందరూ ముద్దుగా బిగ్​బీ అని పిలుచుకుంటారు. ఒకప్పుడు నీ వాయిస్​ పనికిరాదు, హీరోగా సూట్​ కావు అని విమర్శలు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు బాలీవుడ్​ మెగాస్టార్ అయ్యారు.

ఇంట్లో మనిషిగా..

ఇంట్లో మనిషిగా..

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి యాంగ్రీ యంగ్​ మ్యాన్ వంటి తదితర బిరుదులను సంపాదించారు. ఇక కౌన్​ బనేగా కరోడ్​ పతి అనే టీవీ షో ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంట్లో మనిషి అయ్యారు. ఇదిలా ఉంటే కరోనా రక్కసి అప్పట్లో దాదాపుగా ప్రతి ఒక్క సెలబ్రిటీకి సోకిన విషయం తెలిసిందే.

 రెండోసారి కరోనా..

రెండోసారి కరోనా..

అందులో అమితాబ్ బచ్చన్​తోపాటు వారి కుటుంబం కూడా ఉంది. తాజాగా మరోసారి.. అంటే రెండోసారి కరోనా బారిన పడ్డారు బిగ్​బీ అమితాబ్ బచ్చన్​. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

 జాగ్రత్తగా ఉండాలని..

జాగ్రత్తగా ఉండాలని..

అమితాబ్​కు కరోనా పాజిటివ్​ నిర్ధారణ కావడంతో.. ఇటీవల ఆయన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరినట్లు సమాచారం. అయితే అమితాబ్​ బచ్చన్​కు కొవిడ్​ సోకడం ఇది రెండో సారి అని తెలిసిన విషయమే.

 కుటుంబం మొత్తానికి కోరనా..

కుటుంబం మొత్తానికి కోరనా..

ఇదివరకు 2020 సంవత్సరంలో కొవిడ్​ సోకడంతో హాస్పిటల్​లో చికిత్స తీసుకొని.. ఆ తర్వాత కోలుకున్నారు. అప్పుడు అమితాబ్​ బచ్చన్​ ఫ్యామిలీ మొత్తానికి మహమ్మారి సోకింది. అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్య రాయ్, అమితాబ్ మనవరాలు ఆరాధ్య బచ్చన్​కు కూడా కరోనా సోకగా.. అనంతరం కోలుకున్నారు.

 పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​తో..

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​తో..

ఇక అమితాబ్​ బచ్చన్ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ ప్రాజెక్ట్ కె మూవీలో ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. అలాగే రణ్​బీర్​ కపూర్​, అలియా భట్​ తొలిసారిగా జోడి కట్టిన సినిమా బ్రహ్మాస్త్ర. ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్​ 9న విడుదల కానుంది. వీటితోపాటు గుడ్​ బై, ఊంఛాయి చిత్రాల్లో అమితాబ్​ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X