ట్విట్టర్‌కు అమితాబ్ బచ్చన్ వార్నింగ్
అయితే ఇటీవల ట్విట్టర్లో అమితాబ్ పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దాని కామెంట్ల ఫంక్షనింగ్ సరిగా లేక పోవడమే అందుకు కారణం. ఈ మధ్య ఈ సమస్య బాగా ఎక్కువ కావడంతో అమితాబ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభిమానులకు కూడా ఇది ఇబ్బందిగా మారింది.
దీంతో ఆయన ట్విట్టర్ యాజమాన్యానికి హెచ్చరికలు పంపారు. సమస్యను పరిష్కరించక పోతే ట్విట్టర్ నుంచి వైదొలుగుతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగు ద్వారా స్వయంగా వెల్లడించారు. అమితాబ్ ఇచ్చిన వార్నింగుతో సదరు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు త్వరితగతిన చర్యలు చేపట్టాయి.
ఆసంగతి పక్కన పెడితే...అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్ పతి-6' కార్యక్రమం నిన్న ఘనంగా ప్రారంభైంది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈకార్యక్రమం టెలివిజన్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానం పంచే కార్యక్రమం కావడంతో అన్ని వర్గాల బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications












