అమితాబ్ బచ్చన్‌కు ఏఎన్ఆర్-2014 పురస్కారం
హైదరాబాద్: ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్-2014 పురస్కారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. ఈ నెల 27న అవార్డును బిగ్ బీకి ప్రదానం చేయనున్నట్టు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1991లో అక్కినేనిని వరించింది. తన జీవితకాలంలోనే అలాటి మరొక అవార్డును నెలకొల్పాలని అక్కినేని సంకల్పించారు. అన్నపూర్ణా స్టూడియోస్ ఆధ్వర్యంలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ 2005లో అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఎఎన్ఆర్ నేషనల్ అవార్డును నెలకొల్పింది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు ఫోటోలు..

చిత్ర పరిశ్రమకు సేవ చేసిన వారికి
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు యావజ్జీవితం సేవ చేసిన, అసాధారణ విజయాలు సాధించిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డును బహూక రిస్తున్నారు.

అవార్డుతో పాటు...
మెమొంటో, పతకంతో పాటు ప్రారంభంలో అవార్డు గ్రహీతలకు అందించిన రూ. 3 లక్షల నగదు పురస్కరాన్ని తర్వాత 4 లక్షలకు, ప్రస్తుతం 5 లక్షల రూపాయలకు పెంచారు.

ఇప్పటి వరకు...
ఇప్పటి వరకు ఈ అవార్డులను పలువురు ప్రముఖులకు ప్రకటించారు. 2005లో నటుడు, రచయిత, దర్శకుడైన దేవానంద్, 2006 నటి షబానా ఆజ్మీ, 2007లో నటి, నిర్మాత అంజలీ దేవి, 2008లో నటి, నర్తకి, గాయని, కొరియోగ్రాఫర్ వైజయంతి బాలి, 2009లో నేపథ్యగాయని లతా మంగేష్కర్, 2010లో దర్శకుడు కె. బాలచందర్, 2011 నటి, దర్శకురాలు హేమమాలిని, 2012లో రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్, 2013లో నటి శ్రీదేవి ఈ అవార్డు అందుకున్నారు.

ఈ సారి కాస్త జాప్యం
అయితే, ఈసారి అక్కినేని మృతి కారణంగా అవార్డ్ ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది.


Click it and Unblock the Notifications











