సింగర్‌గా మారుతున్న అమితాబ్
బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. తొలిసారిగా ఆయన ఓ డివోషనల్ ఆల్బం కోసం తన గంభీరమైన స్వరంతో భక్తి పాటలు పాడబోతున్నారు. ఈ ఆల్బం ప్రొడ్యూస్ చేస్తున్నది ఎవరో కాదు, మన బచ్చన్ సాబే. అమితాబ్ వాయిస్ ఎంత ఫేమస్ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులైతే ఆయన డైలాగులు అంటే పడి చస్తారు. ఇతరులెవరూ తన వాయిస్‌ను అనుకరించకుండా పేటెంట్ కూడా తీసుకున్నారు. మరి అలాంటి వాయిస్ తో పాటలంటే అభిమానులకు పండగే.
ఆ డివోషనల్ ఆల్బమ్ పేరు హనుమాన్ చాలిసా. ఇందులో అమితాబ్‌తో పాటు మరో 20 మంది బాలీవుడ్ సింగర్స్ స్వరం కలుపుతున్నారు. వీకాన్ మ్యూజిక్, ఎంటర్‌టైన్మెంట్ అండ్ ఎబి కార్ప్ సంస్థలు సంయుక్తంగా ఈ ఆల్బమ్‌కు సమర్పకులు. ఆదేష్ శ్రీవాత్సవ ఈ ఆల్చమ్‌కు సంగీతం సమకూర్చుతున్నారు. అమితాబ్‌తో పాటు ఈ ఆల్బమ్‌లో పాడే వారిలో ఆదేష్, హరిహరణ్, సోను నిగమ్, సురేష్ వాడ్కార్, అభిజిత్, ఉదిత్ నారాయణ, కుమార్ సను, రూప్ కుమార్ రాథోడ్, షాన్, కైలాష్ ఖేర్, ముకుల్ అగర్వాల్, మనోజ్ తివారి, హాన్స్ రాజ్ హాన్స్, ప్రసూన్ జోషి, సుఖ్విందర్, శంకర్ మహదేవ్, బాబుల్ సుప్రియో, కునాల్ గంజావాలా, వినోద్ రాథోడ్ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











