»   » సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి: తెలుగులో బిగ్‌బి ట్వీట్

సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి: తెలుగులో బిగ్‌బి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' షూటింగులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగులో ఆయన జాయిన్ అయ్యారు. తాజాగా బిగ్ బి తన స్నేహితుడు చిరంజీవి గురించి తెలుగులో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

'సూపర్ స్టార్ చిరంజీవి, అదే ఫ్రేమ్ లో ఒక గౌరవం ఉండాలి' అని పేర్కొంటూ అంటూ బిగ్ బి 'సైరా' చిత్రానికి సంబంధించిన తన లుక్ ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఓ ఫోటో విడుదల చేశారు. ఈ చిత్రంలో అమితాబ్, చిరంజీవి గురు శిష్యులుగా కనిపించబున్నట్లు తెలుస్తోంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తవ్వగా.... ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. య్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.


కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ నయనతార నటిస్తోంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో నయనతార కూడా జాయిన్ అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బేనర్లో రూ. 150 కోట్ల బడ్జెట్‌తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని రామ్ చరణ్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేషనల్ లెవల్లో ఈ సినిమా రూపొందిస్తున్నారు.


English summary
Veteran actor Amitabh Bachchan recently went to Hyderabad to join the sets of upcoming multilingual period drama Sye Raa Narasimha Reddy, which has Megastar Chiranjeevi playing the titular role. Amitabh has tweeted a picture from the look tests he did for the big budget movie. In Telugu, Big B praised his co-star, expressing his happiness about getting to share screen space with Chiranjeevi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X