సూపర్ స్టార్ కు రేపు ఆపరేషన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్(69)కు శనివారం ఉదయం ఆపరేషన్ జరగనుంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యులు ఈ శస్త్రచికిత్సను చేస్తున్నారు. ఇక ఈ రోజు(శుక్రవారం)నొప్పి తీవ్రతను తెలుసుకొనేందుకు డాక్టర్లు ఆయనను సీటీస్కాన్‌తో పరీక్షిస్తారు. తనకు జరగబోయే ఆపరేషన్ గురించి తన బ్లాగ్ లో రాస్తూ అది సంక్లిష్టమైంది కాదని డాక్టర్లు చెప్పినట్లు బిగ్‌బీ పేర్కొన్నారు. ఆ బ్లాగ్ లో... ''కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే సర్జరీ అంతగా జటిలమైంది కాదని, సులభంగా పూర్తవుతుందని వైద్యులు చెప్పారు. అయితే అది ఎలాంటి ప్రక్రియ అనేది ఆపరేషన్ టేబుల్‌పైకి వెళ్లిన తర్వాత తెలుస్తుంది'' అని ఫన్ గా అన్నారు.
అలాగే తన ఉదరం గతంలోనే అనేక నొప్పులను, గాయాలను ఎదుర్కొందని తెలిపారు. ఆ ఆపరేషన్ సమయానికి ఆయన కుమారుడు అభిషేక్ ఆయన వద్దే ఉండనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం అమితాబ్ ..రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్ లో నటిస్తున్నారు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులను ఆయన ఈ సంవత్సరం చేయనున్నారు.


Click it and Unblock the Notifications











