అమితాబ్ బచ్చన్ ఆపరేషన్ సక్సెస్
బిగ్ బి అమితాబ్ కు శనివారం నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. ఆయన త్వరలోనే కోలుకుంటారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు ప్రకటించారు. ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో ఆయనకు సర్జరీ జరిగింది.
1982లో అమితాబ్ 'కూలీ' సినిమా షూటింగులో స్టంట్స్ చేస్తుండగా కడుపులో బలమైన గాయం అయింది. అప్పుడు ఆయన నెలల తరబడి ఆసుపత్రి పాలయ్యారు. 2005లో ఆయన కడుపులో మరోసారి సర్జరీ జరిగింది. తాజాగా మళ్లీ ఇప్పుడు కడుపులో నొప్పి తీవ్రం కావడంతో ఆపరేషన్ అనివార్యం అయింది. ఆపరేషన్ కు ముందు అమితాబ్ బ్లాగులో సర్జరీ విషయాన్ని ప్రస్తావించారు. ఇది మైనర్ సర్జరీ మాత్రమే అని, అంత క్లిష్టమైనది ఏమీ కాని వెల్లడించారు.
ఎడతెరిపి లేకుండా షూటింగులుల్లో పాల్లొనడం, సరైన ఆహారం తీసుకోక పోవడంతో పాటు, లేట్ నైట్ పార్టీలకు తరచూ హాజరు కావడం వల్లనే అమితాబ్ అనారోగ్యం పాలయ్యాడని వైద్యులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











