బ్లాగ్ లో రాసి తిట్లు తింటున్న స్టార్ హీరో
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఇప్పుడు ముంబై జనం తిట్లు తింటున్నారు. ముఖ్యంగా ఆయన బ్లాగ్ రాతలు రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురి అయ్యాయి. దానికి కారణం మరేదో కాదు...ముంబై నగరంలో మెట్రోరైలు కోసం ప్రతిపాదించిన మార్గం తన నివాసం 'ప్రతీక్ష' సమీపం నుంచి వెళ్లడంపై అమితాబ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా తన బ్లాగులో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆయన రాతల్లో ఇలా రాసారు..'చివరికి జరిగేదిదే..! మహానగరంగా పిలుచుకుంటున్న ముంబైలో త్వరలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. కొన్ని చోట్ల భూగర్భం నుంచి, మరికొన్నిచోట్లఫ్లైఓవర్‌లాంటి సిమెంటు నిర్మాణాలపై నుంచి చకచకా ముందుకు సాగుతుంది.
పనిలో పనిగా 'ప్రతీక్ష'(ఇది అమితాబ్ స్వగృహం పేరు)పై నుంచి దూసుకెళ్తుంది. మెట్రో ఆగమనంతో ఆటోలు, పసుపురంగు క్యాబ్‌లు గణనీయంగా తగ్గుతాయి. రైలు కూతలే వినిపిస్తాయి. సో...ఏకాంతానికిక బైబై. హలో ప్రయాణికులూ..అంటూ గడుపుతా..' నంటూ అమితాబ్ మెట్రో మార్గంతో తన ఏకాంతానికి ఎసరొచ్చిందంటూ తీవ్రంగా తన బ్లాగులో రాసుకున్నాడు. ఈ రాతలు చదివిన వారు..ఎవరికి తోచిన విధంగా వారు అమితాబ్‌పై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనపై స్వార్థపూరితుడివంటూ దుమ్మెత్తిపోశారు. ప్రజల ప్రయోజనాలు పట్టవా? నీ క్షేమమే చూసుకుంటావా? అంటూ నిలదీశారు. మొత్తానికి అమితాబ్ మరో వివాదానికి తెరలేపాడు.


Click it and Unblock the Notifications











