వచ్చే జన్మలో నాకు అలా.. :అమితాబ్
ఆయన ట్వీట్ లో ... వచ్చేజన్మంటూ ఉంటే పాత్రికేయుడిగా పుడతానని వ్యాఖ్యానించాడు 'బిగ్ బీ' అమితాబ్ బచ్చన్. 'మరుజన్మలోనా? కచ్చితంగా విలేకరినవుతా. పర్యవసనాల గురించి భయపడకుండా.. అనుకున్నది మాట్లాడే, వ్యక్తీకరించగలిగే స్వేచ్చ.. ఆనందాలూ ఆస్వాదిస్తాను!' అంటూ శనివారం ట్వీట్ చేశాడు. అమితాబ్ ప్రస్తుతం ప్రకాశ్ ఝా రూపొందిస్తున్న 'సత్యాగ్రహ - డెమోక్రసీ అండర్ ఫైర్' చిత్రంలో నటిస్తున్నాడు.
ప్రస్తుతం భోపాల్‌నగరంలో ప్రకాష్ ఝా దర్శకత్వంలో సత్యాగ్రహ సినిమా షూటింగ్‌లో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాష్ ఝా అనూహ్య వేగంతో షూటింగ్ చేస్తున్నారని, ఆయనకు తాను ఏమి చేస్తున్నదీ స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప విషయమని, చాలామంది దర్శకులకుకూడా ఇది తెలుసని చెప్పారు. సత్యాగ్రహ సినిమాలో అజయ్ దేవగన్, కరీనా కపూర్, అర్జున్ రామ్‌పాల్, మనోజ్ బాజ్‌పాయ్‌కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications
