»   » నేడు అమితాబ్ బర్త్‌డే...వచ్చే ఏడాదితో 102 ఏళ్లు!

నేడు అమితాబ్ బర్త్‌డే...వచ్చే ఏడాదితో 102 ఏళ్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: హిందీ సినీ పరిశ్రమ ఐకాన్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నేడు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి ఆయన వచ్చే ఏడాది 102 ఏళ్ల వయసుకు ఎలా చేరుకుంటారు? అనే విషయం తెలుసుకోవాలంటే స్టోరీ తప్పకుండా చదవాల్సిందే.

ఉమేష్ శుక్లా దర్శకత్వంలో వచ్చే సినిమాలో అమితాబ్ 102 ఏళ్ల వృద్ధుడిగా నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని భానుషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగే ఈచిత్రానికి '102 నాటౌట్' అనే టైటిల్ ఖరారు చేసారు. మరో 17 ఏళ్లు జీవించి ఎక్కువ కాలం జీవించిన వరల్డ్ రికార్డు స్థాధించాల లక్ష్యంతో ఉండే వ్యక్తి కథే ఈ సినిమా.

ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని అందరికీ ఓ పాఠంలా నవ్విస్తూ చెప్పే కథ ఇది. ఇందులో పరేష్ రావల్ 72 ఏళ్ల వయసున్న వ్యక్తిగా అమితాబ్ కొడుకు పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలకు ప్రాణం పోసిన అమితాబ్ ఈ పాత్రలోనూ అందరినీ మెప్పించడం ఖాయమని దర్శక, నిర్మాతలు నమ్ముతున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే....తన పుట్టినరోజును పురస్కరించుకుని నిర్వహించే సేవా కార్యక్రమాల్లో 3000 పేద కుటుంబాలకు సోలార్ పరికరాలను సమకూర్చాలని అమితాబ్ బచ్చన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు త్వరలో అందకు సంబంధించిన పరికరాలను ఎంపిక చేసిన వారికి పంపిణీ చేయనున్నారు.

English summary
Amitabh Bachchan will be playing a 102-year-old man in Umesh Shukla's next. The film, being produced by Bhushan Kumar, is both funny and emotional and is titled 102 Not Out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu