Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'రావణ్' ని అవే దెబ్బతీసాయి: అమితాబ్ విమర్శ
తన కుమారుడు, కోడలు కలిసి నటించిన భారీ చిత్రం 'రావణ్' బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడం అమితాబ్ కు ఊహించని పరిణామమయింది. దాంతో ఆయన తాజాగా ట్విట్వర్ లో ఈ చిత్రంపై విమర్శలు చేసారు. 'రావణ్' బోల్తా కొట్టడంపై కారణాలు అన్వేషించారు. సినిమాలో ఎడిటింగ్ లో లోపాలే అభిషేక్ పాత్రను దెబ్బతీశాయని ట్విటర్ లో ఆదివారం వ్యాఖ్యానించారు. తన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన ఆ చిత్రం కాస్తా ఫ్లాఫ్ టాక్ రావడంతో ఆయన నిస్పృహ చెందే ఇలా కామెంట్ చేసారని బాలీవుడ్ వర్గాలు అన్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై 'రావణ్' రెండో హీరో విక్రమ్, సినిమాటొ గ్రాఫర్ సంతోష్ శివన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'అమితాబ్ అంటే మాకు గౌరవమే. దర్శకుడు మణిరత్నంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై మేం మాట్లాడటం లేదు. కానీ సినిమా భవితవ్యాన్ని తేల్చాల్సింది ప్రేక్షకులే' అని వారు తాజాగా పేర్కొన్నారు. దాంతో మరోసారి ట్విటర్ లో అమితాబ్ ట్వీట్ చేస్తూ...మణిరత్నాన్ని అగౌరవపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇక 'రావణ్' విడుదలైన అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.