పూరీ జగన్నాథ్ హిందీ సినిమా నిజమే..!!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ బాలీవుడ్ సినిమాని అమితాబ్ బచ్చన్‌తో తీయబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడది నిజమే నని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్ తన సొంత బ్లాగు 'బిగ్‌బి.బిగ్‌అడ్డా.కామ్'లో వెల్లడించారు. అయితే మీడియాలో తాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'బుద్ధ'గా నటించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను జగన్నాథ్‌తో చేయబోతున్న సినిమా పేరు 'బుడ్డా' అనీ, దానర్థం వృద్ధుడనీ, అంతేకానీ అందరూ అనుకుంటున్నట్లు గౌతమ బుద్ధుడు కాదనీ ఆయన తెలిపారు. ఇంగ్లీషులో స్పెల్లింగ్ వల్ల అందరూ ఆ సినిమాని 'బుద్ధ' అనుకున్నారనీ, అలాగే తనతో 'భూత్‌నాథ్' డైరెక్టర్ వివేక్‌శర్మ 'బుద్ధం శరణం గచ్చామి' అనే సినిమాని తీయాలనుకోవడం కూడా ఇలా పొరబాటుగా అనుకోవడానికి తావిచ్చిందనీ బిగ్ బి తన బ్లాగులో వివరించారు. ఏదైమైతేనేం పూరీ జగన్నాధ్ బాలీవుడ్ ప్రయాణం కరెక్టేనని తేలింది. ప్రస్తుతం పూరి, గోపిచంద్ ల కాంబినేషన్ లో గోలీమార్ అనే చిత్రం రూపొందుతోంది. దానిలో ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











