ల్యాండ్ స్కాంలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ!
ముంబై : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీపై భూ కుంభకోణం ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వై.పి.సింగ్ వారిపై ఆరోపణలు చేస్తూ...ఓ మాల్ నిర్మాణంలో వారు పెట్టుబడులు పెట్టారు. అయితే అయితే ఆ నిర్మాణం BMC(బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్) నిబంధనలను ఉల్లఘించి కడుతున్నారని వెల్లడించారు.
ఇటీవల ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సింగ్ మాట్లాడుతూ ముంబైలోని ఓ మాల్ నిర్మాణం కోసం బచ్చన్ ఫ్యామిలీ రూ. 9 కోట్లు లోన్ ఇచ్చిన విషయం చెప్పలేదు కానీ...ఈ నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ గ్రౌండ్ లో నిర్మిస్తున్నారని ఆరోపణలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బచ్చన్ ఫ్యామిలీ వెంటనే తమ డబ్బను వెనక్కి తీసుకుని ప్రస్తుతం పాక్షింగా నిర్మాణం జరిగిన మాల్‌ను పడగొట్టడానికి BMCకి సహాయం చేయాలని అన్నారు. వారు సమాజంలో మంచి పరు కలిగి ఉన్నారు. వీలైనంత వరకు వారు ఈ సమస్యలో ఇరుక్కోకుండా ఉండటమే మంచిదని సూచించారు.
అమితాబ్ సినిమాల విషయానికొస్తే.. బిగ్ బి త్వరలో 'టైటానిక్' హీరో లియోనార్డో డికాప్రియో తో కలసి నటించబోతున్నారు.డికాప్రియో ప్రధాన పాత్రలో నటించే చిత్రం 'ది గ్రేట్ గాట్స్‌బీ' చిత్రంలోకీ రోల్ కి అమితాబ్ ని ఎంపిక చేసారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే ఈ చిత్రం త్రీడీ సినిమా. ఇస్లా ఫిషర్ హీరోయిన్ గా చేస్తోన్న ఈచిత్రంలో మేయర్ వుల్ఫ్‌షీమ్ అనే పాత్రలో ఆయన కనిపిస్తారు. ఈ చిత్రానికి బజ్ లహ్రమన్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 10, 2013లో ఈచిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











