అమితాబ్, జయా బచ్చన్ జంటగా..రొమాంటిక్‌గా!

By Bojja Kumar

బాలీవుడ్ స్టార్ కపుల్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ మరోసారి జంటగా వెండి తెరపై మెరవబోతున్నారు. సూజిత్ సిర్‌కార్ దర్శకత్వం వహించబోతున్న ఓ హిందీ చిత్రంలో ఈ జంట భార్య భర్తలుగా కనిపించనున్నారు. ఈ ఇద్దరిని ఈ చిత్రంలో దర్శకుడు రొమాంటిక్‌గా చూపించడానికి స్ర్కిప్టు తయారు చేసుకున్నాడని, ఏళ్ల తరబడి అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట ఎలాంటి విబేధాలు లేకుండా కేవలం ప్రేమను పంచుకుంటూ జీవితాన్ని ఎలా సుఖవంతం చేసుకున్నారు అనే కోణాన్ని ఎక్స్ ఫోజ్ చేస్తూ చూపించనున్నాడని తెలుస్తోంది.

పెళ్లయిన తర్వాత అమితాబ్-జయ...చివరి సారిగా 2001లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'కభి కుషి కభి గమ్' చిత్రంలో భార్య భర్తలుగా నటించారు. వీరిద్దరు భార్య భర్తలుగా కలిసి నటించిన యష్ చోప్రా ఫిల్మ్ 'సిల్ సిలా'భారీ విజయం సాధించింది అప్పట్లో. తాజాగా ఈ స్టార్ కపుల్ మళ్లీ వెండి తెరపై మెరవనుండటంతో అమితాబ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అమితాబ్ దంపతులు బెస్టాప్ లక్ చెబుతున్నారు. సూజిత్ సిర్‌కార్ మూడేళ్ల క్రితం అమితాబ్‌తో 'జానీ మస్తానా'అనే చిత్రాన్ని రూపొందించాడు. అయితే ఆ చిత్రం విడుదలకు నోచుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X