twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ విన్నర్ డైరక్షన్ లో పాకిస్ధానీగా అమితాబ్

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ త్వరలో ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి దర్శకత్వంలో చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను ఆస్కార్ అవార్డ్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రసూల్‌పూకుట్టి. ఆయన దర్శకుడిగా మారాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. అయితే సరైన కథ దొరకక ప్రాజెక్టు ముందుకు వెళ్లటం లేదు. అయితే ఇన్నాళ్లకూ ఆయనకు ఆ అవకాసం వచ్చింది. రసూల్ స్నేహితుడు అమితాబ్‌సింగ్ ఇటీవల ఆయన్ను ఓ మంచి కథతో కలిశారు. ఆ కథ విని నచ్చిన రసూల్ దర్శకుడిగా తన అరంగేట్రానికి ఇంతకన్నా మంచి కథ ఉండదని భావించారు.

    వెంటనే ఆయన తన ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్ కలిసారు. ఈ కథ చెప్పడం జరిగిందని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఆయన పరదేశిగా నటించబోతున్నారట. పాకిస్తానీగా కనిపించనున్నారని సమాచారం. అయితే ఇది రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రం కాదన తెలుస్తోంది.

    కథ ప్రకారం ...రెండు బోర్డర్లకు అవతల జీవిస్తున్న ప్రజల జీవితాలు ఎలా ఉంటాయి...అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని వినికిడి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్‌గా పలు మలయాళం, తమిళ్, హిందీ, హాలీవుడ్ చిత్రాలకు చేశారు రసూల్. మంచి టెక్నీషియన్‌గా నిరూపించుకున్న ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం అన్ని చోట్లా హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    మరో ప్రక్క శ్రీదేవి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఇంగ్లీష్-వింగ్లీష్'. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. దర్శక నిర్మాతలు బాల్కీ-గౌరీషిండే మాట్లాడుతూ శ్రీదేవిపై ఉన్న అభిమానంతోనే అమితాబ్‌బచ్చన్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించారని తెలిపారు. అమితాబ్ అతిథి నటన హైలెట్‌గా వుంటుందని, ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని తెలిపారు.

    English summary
    Amitabh Bachchan is likely to essay the role of a Pakistani national in Oscar-winning sound designer Resul Pookutty's directorial debut. Bachchan, 69, will play a Pakistani national in Resul Pookutty's film, with the actor verbally agreeing for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X