కామన్ మ్యాన్‌కు రూ.5 కోట్లు- అమితాబ్ హ్యాపీ
కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 5లో ఒక కామన్ మ్యాన్‌కి రూ. కోట్లు దక్కడంపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కామన్ మ్యాన్ యొక్క స్ట్రెంత్ ఏమిటో తెలియ చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ కు చెందిన సునిల్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఐదు కోట్లు గెలుచుకున్నాడు.
ఈ విషయమై అమితాబ్ తన బ్లాగులో వెల్లడిస్తూ...కేవలం నెలకు రూ. 6,500 సంపాదించే ఒక సాధారణ వ్యక్తి తన మేధా శక్తితో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో చోటు దక్కించుకున్నాడు, అతని టాలెంట్ కు నా హాట్సాఫ్, ఎంతో గర్వంగా ఉంది అంటూ పేర్కొన్నారు. అతను షో విజేత అని తెలియగానే నాతో పాటు కార్యక్రమం నిర్వాహకులు కూడా ఎంతో సంతోష పడ్డారు. ఇది నిజంగా నా జీవితంలో మరిచి పోలేని రోజు అని చెప్పకొచ్చారు.
కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి కార్యక్రమాలు వీక్షకుల్లో విజ్ఞానాన్ని పెంచడంతో పాటు, అదృష్టానికి ప్రతిభ కూడా తోడైతే ఇలాంటి కామన్ మ్యాన్లు కరోడ్ పతులు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











