కమల్ హాసన్ దర్శకత్వంలో ... అమితాబ్, రేఖ?

By Staff

Amitabh Bachan
1970లలో అమితాబ్, రేఖ జంట హాటెస్ట్ పెయిర్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. వీరి సినిమాలంటే అంటే భారత ప్రేక్షకులకు భలే ఆసక్తి. వారిద్దరూ గతంలో కొన్ని సినిమాల్లో కలసి చేసారు. ఆ చిత్రాలకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఆ అవకాశం రాలేదు. ఆ ఇద్దరి మధ్య ప్రేమానుబంధం వుందనే ప్రచారం నేపథ్యంలో ఆమెతో నటించకూడదని అప్పట్లో అమితాబ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకూ ఆయన దాన్ని నిలబెట్టుకున్నారు. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు మరోసారి ఆ జంట తెరపై కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కమలహాసన్, కాజోల్ జంటగా వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించ తలపెట్టిన 'మర్మయోగి'లో ఆ ఇద్దరూ భార్యాభర్తలుగా నటించవచ్చని భావిస్తున్నారు. అందులోనూ రేఖతో మళ్లీ కలిసి నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కొద్ది రోజుల క్రితమే అమితాబ్ వెల్లడించారు. ఇప్పుడు మంచి రోల్ వస్తే రేఖతో కలిసి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో వాల్ట్ డిస్నీ సంస్థ ఆ ఇద్దరినీ మరోసారి తెరపై జంటగా చూపడానికి సన్నాహాలు చేస్తోంది.'మర్మయోగి'ని కమలహాసన్ స్వయంగా డైరెక్ట్ చేయనుండటం గమనార్హం. యేమో మళ్ళీ ఆ జంట అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూద్దాం....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X