For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరుగురి చేతిలో గ్యాంగ్ రేప్.. అమితాబ్, అనుష్కను కంటతడి పెట్టించిన తెలుగు సామాజిక కార్యకర్త

|

భారతీయ సినిమా పరిశ్రమ దిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కుల, మత, ప్రాంతాలు, సంస్క‌తికి భిన్నంగా అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఎంతో మంది జీవిత గాధలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తాజాగా అలాంటి భావోద్వేగమైన సంఘటన కేబీసీలో సాక్ష్యంగా నిలిచింది. హోస్ట్ బిగ్‌బీనే కాకుండా బాలీవుడ్ తారలను కదిలించిన తెలుగు మహిళ, పద్మ భూషణ్ సునీతా కృష్ణన్ విషాదగాధ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

 సునీతా కృష్ణన్ విషాదం..

సునీతా కృష్ణన్ విషాదం..

మానవ అక్రమ రవాణాకు గురవుతున్న చిన్నారులను రక్షించే బాధ్యతను భుజాన వేసుకొన్న సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఇటీవల కేబీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన యుక్త వయస్సులో ఎనిమిది మంది చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురయ్యాననే విషయాన్ని చెప్పడంతో అమితాబ్ భావోద్వేగాని లోనయ్యారు. ఆ తర్వాత తాను మహిళలు అలాంటి భారీన పడకుండా ఎలా చర్యలు తీసుకొంటాననే విషయం బిగ్‌బీ హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

బిగ్‌బీ నివ్వెరపోయేలా

బిగ్‌బీ నివ్వెరపోయేలా

బిగ్‌ బీ అమితాబ్‌ను నివ్వెరపోయేలా సునీతా కృష్ణన్ ఓ సంఘటనను వెల్లడించింది. సెక్స్ రాకెట్ నుంచి మూడు సంవత్సరాల బిడ్డను, మరో యువతిని ఎలా కాపాడింది షోలో వివరించడంతో అమితాబ్ కంటతడి పెట్టినంత పనిచేశారు. తాజా ఎపిసోడ్‌ను చూసిన బాలీవుడ్ తార అనుష్క శర్మ ఆవేదనకు గురయ్యారు.

అనుష్కశర్మ ట్వీట్

అనుష్కశర్మ ట్వీట్

సునీతా కృష్ణన్ చేస్తున్న సామాజిక సేవ, ఆమె విషాదంపై అనుష్క శర్మ ట్విట్టర్‌లో స్పందించారు. దారుణమైన, క్రూరమైన సంఘటనలకు పోరాడుతున్న సునీతా కృష్ణన్ కథ విని షాక్ గురయ్యాను. మహిళలు అక్రమ రవాణాకు గురి కాకుండా ఆమె అద్భుతమైన కార్యాన్ని భుజానికి ఎత్తుకొన్నది. మూడేళ్ల చిన్నారి సెక్స్ ట్రాఫికింగ్ గురికావడం అత్యంత దయనీయం అని అనుష్క శర్మ ట్వీట్ చేశారు.

ప్రపంచంలో ఇలాంటి మనుషులు

ప్రపంచంలో ఇలాంటి మనుషులు

ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తు సునీతా కృష్ణన్ లాంటి ఉన్నతమైన వ్యక్తులు ఇంకా ప్రపంచంలో ఉన్నారనే విషయం కేబీసీ ద్వారా తెలుసుకొని గర్వపడుతున్నాను. ఇలాంటి స్ఫూర్తిని కలిగించే వ్యక్తిని అందించిన కేబీసీ ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులను ప్రపంచానికి ఈ షో ద్వారా పరిచయం కావాలని కోరుకొంటున్నాను అని అనుష్క శర్మ ట్వీట్ చేసింది.

English summary
Telugu Social Worker Sunitha Krishnan participated in Amitabh Bachchan's KBC.In this occassion Anushka Sharma tweeted that,The incidents and the dirty realities that a crusader like sunita_krishnan brought to light on the KBC episode are so shocking and hurtful. She has done and is doing such incredible work in rescuing women and young girls as little as 3 years old from sex trafficking.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more