Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆరుగురి చేతిలో గ్యాంగ్ రేప్.. అమితాబ్, అనుష్కను కంటతడి పెట్టించిన తెలుగు సామాజిక కార్యకర్త
భారతీయ సినిమా పరిశ్రమ దిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కుల, మత, ప్రాంతాలు, సంస్కతికి భిన్నంగా అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఎంతో మంది జీవిత గాధలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తాజాగా అలాంటి భావోద్వేగమైన సంఘటన కేబీసీలో సాక్ష్యంగా నిలిచింది. హోస్ట్ బిగ్‌బీనే కాకుండా బాలీవుడ్ తారలను కదిలించిన తెలుగు మహిళ, పద్మ భూషణ్ సునీతా కృష్ణన్ విషాదగాధ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
సునీతా కృష్ణన్ విషాదం..
మానవ అక్రమ రవాణాకు గురవుతున్న చిన్నారులను రక్షించే బాధ్యతను భుజాన వేసుకొన్న సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ఇటీవల కేబీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన యుక్త వయస్సులో ఎనిమిది మంది చేతిలో గ్యాంగ్ రేప్‌కు గురయ్యాననే విషయాన్ని చెప్పడంతో అమితాబ్ భావోద్వేగాని లోనయ్యారు. ఆ తర్వాత తాను మహిళలు అలాంటి భారీన పడకుండా ఎలా చర్యలు తీసుకొంటాననే విషయం బిగ్‌బీ హృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
బిగ్‌బీ నివ్వెరపోయేలా
బిగ్ బీ అమితాబ్‌ను నివ్వెరపోయేలా సునీతా కృష్ణన్ ఓ సంఘటనను వెల్లడించింది. సెక్స్ రాకెట్ నుంచి మూడు సంవత్సరాల బిడ్డను, మరో యువతిని ఎలా కాపాడింది షోలో వివరించడంతో అమితాబ్ కంటతడి పెట్టినంత పనిచేశారు. తాజా ఎపిసోడ్‌ను చూసిన బాలీవుడ్ తార అనుష్క శర్మ ఆవేదనకు గురయ్యారు.
అనుష్కశర్మ ట్వీట్
సునీతా కృష్ణన్ చేస్తున్న సామాజిక సేవ, ఆమె విషాదంపై అనుష్క శర్మ ట్విట్టర్లో స్పందించారు. దారుణమైన, క్రూరమైన సంఘటనలకు పోరాడుతున్న సునీతా కృష్ణన్ కథ విని షాక్ గురయ్యాను. మహిళలు అక్రమ రవాణాకు గురి కాకుండా ఆమె అద్భుతమైన కార్యాన్ని భుజానికి ఎత్తుకొన్నది. మూడేళ్ల చిన్నారి సెక్స్ ట్రాఫికింగ్ గురికావడం అత్యంత దయనీయం అని అనుష్క శర్మ ట్వీట్ చేశారు.
ప్రపంచంలో ఇలాంటి మనుషులు
ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తు సునీతా కృష్ణన్ లాంటి ఉన్నతమైన వ్యక్తులు ఇంకా ప్రపంచంలో ఉన్నారనే విషయం కేబీసీ ద్వారా తెలుసుకొని గర్వపడుతున్నాను. ఇలాంటి స్ఫూర్తిని కలిగించే వ్యక్తిని అందించిన కేబీసీ ధన్యవాదాలు. ఇలాంటి వ్యక్తులను ప్రపంచానికి ఈ షో ద్వారా పరిచయం కావాలని కోరుకొంటున్నాను అని అనుష్క శర్మ ట్వీట్ చేసింది.