»   » 18 తర్వాత కలిసిన నటిస్తున్న లెజెండ్రీ స్టార్స్ ..!

18 తర్వాత కలిసిన నటిస్తున్న లెజెండ్రీ స్టార్స్ ..!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమితాబ్,శ్రీదేవి లు జంటగా 18 ఏళ్ల క్రితం నటించిన సినిమా 'ఖుదాగవా ' అప్పట్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీసువద్ద కలెక్షన్ ల రికార్డు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలొ అమితాబ్,శ్రీదేవి లు అత్యద్భుతంగా నటించి అశేష ప్రేక్షకుల మన్ననలు పొంది హిట్ పెయిర్ గా చిత్ర పరిశ్రమలో చెరగని స్థానాన్ని ఏర్పరుచుకొన్నారు. ఆ తర్వాత శ్రీదేవి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోయింది. అయితే ఇంతకీ ఈ విశేషాలు ఎందుకు చెబుతున్నామంటే తిరిగి ఇప్పుడు వీరిద్దరూ తెరపై సందడి చేయడానికి సిద్దమయ్యారు.ఫిలింవర్గాల వివరాలప్రకారం దర్శకుడు ఆర్.బల్కీ భార్య గౌరీ షిండే దర్శకురాలిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఇంగ్లీష్ వింగ్లీష్ '.

  ఈ చిత్రంలో శ్రీదేవి గృహిణి పాత్రలో నటిస్తున్నారు.ఆమె ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేందుకు ప్రయత్నించే సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వుతెప్పిస్తాయని దర్శకురాలు చెబుతున్నారు.అటువంటి ఇల్లాలు చివరికి ఇంగ్లిష్ భాషపై పట్టుసాధిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఇది శ్రీదేవి నిజజీవిత కథ అనే చెప్పాలి. శ్రీదేవికి హిందీ వచ్చు కానీ, ఇంగ్లిష్ రాదు!ఇటీవలే అమితాబ్,శ్రీదేవి లు పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.గణేష్ హెగ్డే నృత్య దర్శకత్వంలొ నృత్యం కూడా చేసారు.ఈ సందర్బంగా అమితాబ్ మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత స్రీదేవితో కలసి నటిస్తున్నాను.నాకు పాత రోజులే గుర్తుకు వస్తున్నాయి.ఆమె లో అప్పటి ఉత్సాహం,వెంటనే స్పందించే గుణాలు ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు.

  English summary
  After 18 long years, the legendary stars Amitabh Bachchan and Sridevi will be seen sharing screen space in Balki's wife Gauri Shinde's imminent venture ‘English Vinglish’.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more