పూరీ జగన్నాధ్ చేస్తున్న 'బుడ్డా'లో అమితాబ్ పాత్ర ఏమిటంటే...
'నువ్వు ముసలాడివి' అని ఎవరైనా అంటే వాళ్ల తాట తీస్తాను. ఆ మాటే అంటే అస్సలు నచ్చదు.'బుడ్డా...ఓ కొత్త తరహా సినిమా. అందులో నేను పెద్ద డాన్‌ని. తమాషాగా ఉంటూనే సీరియస్‌గా సాగుతుంది అంటూ మెగా హీరో గా బాలీవుడ్ చే కీర్తింపబడుతున్న అమితాబ్ తన తాజా చిత్రం 'బుడ్డా' గురించి చెప్పుకొస్తున్నారు.అలాగే చిత్ర దర్సకుడు గురించి చెపుతూ.. పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న విధానం చాలా బాగుంది'అని రీసెంట్ గా ట్వీట్ చేసారు.అలాగే ఈ సినిమా చేయడానికి చాలా విషయాలు నన్ను పురిగొల్పాయి. కేవలం నా ఒక్క పాత్ర కోసమే కాదు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల కదలికలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తప్పకుండా నా అభిమానులకు నచ్చుతుంది అని బిగ్ బి మురిసిపోతూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాలో అమితాబ్ ఓ పాట కూడా పాడారు. 'ఈ మధ్య వస్తున్న పాటల్లో సాహిత్యం, మాధుర్యం నాకే నామాత్రం నచ్చడం లేదు. పాత పాటలే నయమనిపిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ పాట పాడాను. చాలా రోజుల తర్వాత నా గొంతు వినిపిస్తున్నాను. కేవలం పాట నచ్చే ఒప్పుకున్నాను. పాట వింటే మీకు బాగా నచ్చుతుంది. చక్కటి అనుభూతినిస్తుంది' అని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు.జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా మీద అమితాబ్‌కు చాలా ఆశలే ఉన్నాయి.అమితాబ్ సొంత బ్యానర్ ఏబిసి పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











