twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టుడే రిలీజ్: అమితాబ్ ‘వాజిర్‌’ కథ ఇదే(ప్రివ్యూ)

    By Srikanya
    |

    ముంబై : ఎప్పటికప్పుడు కొత్త పాత్రలలో పలకరించటానికి ఇష్టపడే అమితాబ్‌ బచ్చన్‌... ఈ కొత్త ఏడాదిలో ‘వాజిర్‌'తో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఫరాన్‌ అక్తర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేఫ్‌ జాన్‌ అబ్రహమ్‌, అదితిరావ్‌ హైదరి కీలక పాత్రల్లో నటించారు. బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వంలో విధు వినోద్‌ చోప్రా నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.

    Amithab's Wazir preview

    చిత్రం కథేమిటంటే.... చదరంగాన్ని యుద్ధరంగంగా భావించే ఓ గ్రాండ్‌ మాస్టర్ ఓం కారంత్‌ (అమితాబ్). ఓ యాక్సెండెంట్ లో తన భార్యని, కాళ్లను పోగొట్టుకుంటాడు. ప్రమాదవశాత్తు రెండు కాళ్లు పోగొట్టుకుని ఇంటికే పరిమితమయ్యాడు. ఒక్కడే నల్ల పావులు కదుపుతూ సమ ఉజ్జీ కోసం ఎదురుచూస్తున్నాడు.

    మరోవైపు యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ చెందిన ఓ యంగ్ ఆఫీసర్ దానిష్ అలీ (ఫర్హాన్ అక్తర్). టెర్రరిస్ట్ లకు అతనికి మధ్య జరిగిన గొడవలో అతను తన కూతురుని పోగొట్టుకుంటాడు. అంతేకాదు...అతని భార్య అతనికి దూరం అవుతుంది. ఉద్యోగంలోంచి సస్పెండ్ అవుతాడు.

    ఇలాంటివీరిద్దరినీ విధి దగ్గరకు చేర్చింది. అతను ఖాళీగా ఉన్న తెల్లపావులందుకున్నాడు. వారిద్దరూ ఆటతో కలిశారు. కానీ ఓ శత్రువు కోసం కలిసి వేట మొదలెట్టారు. ఆ వృద్ధుడు ఆలోచన అయితే ఈ యువకుడు ఆయుధం. ఆయన ప్రశ్న అయితే ఇతను సమాధానం. మరి ఈ ఆటలో గెలిచిందెవరు? వారి వేట ఎవరి కోసం? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వాజిర్‌'.

    చిత్రం విశేషాలకు వస్తే... అమితాబ్‌ ఇందులో వీల్‌ఛైర్‌కే పరిమితమైన వికలాంగుడిగా కనిపించబోతున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సాయంతో ఆయన కాళ్లు మోకాళ్ల వరకే కనిపించేలా చేశారు. ‘వాజిర్‌' స్క్రిప్టును పూర్తిచేయడానికి ఐదేళ్ల సమయం పట్టింది. తొలుత ఈ కథతో విధు వినోద్‌ చోప్రా హాలీవుడ్‌ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడు. అయితే ఆ నిర్మాత మరణించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.

    English summary
    Wazir is produced by Vidhu Vinod Chopra and stars Farhan Akhtar, Amitabh Bachchan and Aditi Rao Hydari in lead roles.Wazir is directed by Bejoy Nambiar and distributed by Relaince Entertainment. Wazir is all set to hit the screens on 8th January, 2016.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X