'ఢీ' హిందీ రీమేక్ లో ఆ హీరో నే ఖరారు
శ్రీను వైట్ల సూపర్ హిట్ చిత్రం ఢీని కూడా హిందీలో రీమేక్ చేయాటనికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రంలో హీరో విష్ణు చేసిన పాత్రను అబిషేక్ బచ్చన్, అతని తండ్రి చంద్రమోహన్ చేసిన పాత్రను అమితాబ్ బచ్చన్ చేయటానికి ఓకే చేసినట్లు సమాచారం. ఇక కీలకపాత్రలో చేయటానికి సంజయ్ దత్ ఓకే చేసారు.తెలుగులో శ్రీహరి చేసిన జెనీలియా అన్న పాత్రని సంజయ్ దత్ చేయనున్నారు. సంజయ్ దత్ ని కలసిన కోన వెంకట్ ఈ క్యారెక్టర్ ని చెప్పి ఒప్పించారు దర్శకుడు ఇంద్రకుమార్ ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారని సమాచారం. ఇంద్రకుమార్ గతంలో ఢమాల్, డబుల్ ఢమాల్, మస్తీ వంటి కామిడీ సినిమాలు రూపొందించారు. రైటర్ కోనవెంకట్ ఈ హిందీ వెర్షన్ కి స్క్రిప్టు రాయమని అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటిక్ రెడీ, పోకిరి చిత్రాలు హిందిలో రీమేక్ అయ్యాయి. అలాగే విక్రమార్కుడు, కిక్ చిత్రాలు రీమేక్ లు షూటింగ్ లో ఉన్నాయి. మర్యాదరామన్న రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. అలాగే జెనీలియాను హీరోయిన్ గా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











