ఎన్ని బూతులో?(ఆ సినిమాకు 40 సెన్సార్ కట్స్)
హైదరాబాద్: సిద్ధార్థ్‌వర్మ, విజయ, మధు, తేజ, అశ్వి, మనస్విని, సుశ్మిత ప్రధాన పాత్రధారులుగా సుజాతా ఆర్ట్స్ పతాకంపై అంజి శ్రీను దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం 'అమ్మా నాన్న ఊరెళితే'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు....బూతు సీన్లతో నిండిన సినిమాలా ఉందనే అనుమానాల్ని కలిగించాయి.
తాజాగా సెన్సార్‌కు వెళ్లిన ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఏకంగా 40 కట్స్ ఇచ్చి దర్శక నిర్మాతలకు షాకిచ్చారు. సినిమాలో బూతు సీన్లు శృతి మించి ఉండబట్టే ఇన్ని కట్స్ వేసారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇన్ని కట్స్ ఇచ్చిన తర్వాత సినిమా విడుదల చేయడం వేస్ట్ అని వాదిస్తున్న నిర్మాత జక్కుల నాగేశ్వరరావు చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపేందుకు సన్నద్ధం అవుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ... మా సినిమాకు మేము ఊహించని విధంగా 40కి పైగా కట్స్ రావడం మమ్మల్నిషాక్‌కి గురి చేసింది. సెన్సార్ బోర్డ్‌కి మా దర్శకుడు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా... పట్టించుకోకపోగా, కనీసం ఆ కట్స్ కూడా మాకు అందించలేదు. సెన్సార్ బోర్డ్ తీరు మమ్మల్ని చాలా బాధించింది. దీన్ని సవాల్ చేస్తూ తమకు న్యాయం చేయాల్సిందిగా రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేస్తున్నామని తెలిపారు.

అన్యాయం అంటున్న దర్శకుడు
చిత్ర దర్శకుడు అంజి శ్రీను మాట్లాడుతూ.. కొన్ని సినిమాలకు చాలా సులువుగా సెన్సార్ దొరుకుతుంది. అందరికీ న్యాయం చేయాల్సిన సెన్సార్ బోర్డ్, కొంతమంది బడా నిర్మాతలకు దాసోహం అయ్యిందేమోనని, అనుమానంగా ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేసి అన్ని వివరాలు త్వరలో ఆధారాలతో బయటపెడతాను.. అని అన్నారు

కాన్సెప్టు ఏమిటి
నలుగురు కొత్త జంటలతో ఈ చిత్రం సాగుతుందని, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో యువతను ఆకట్టుకునేలా రూపొందించామని, పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు.

ఆడియో విడుదలైంది
ఈ చిత్రానికి సంబంధించిన సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడెకరాల స్థలంలో జరిగింది. సంగీత దర్శకుడు మున్నా కాశి మాట్లాడుతూ- పూర్తి స్వేచ్ఛనిచ్చి దర్శక నిర్మాతలు మంచి పాటలను రాబట్టుకున్నారని తెలిపారు.

నటీనటులు
సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత, మనస్విని, తనూష, సుస్మిత, శివకృష్ణ, అపూర్వ, ఎఫ్ఎమ్ బాబాయ్ మొదలగు వారు తారాగణం

సాంకేతిక విభాగం
ఈ చిత్రానికి మాటలు: కె.వి. రాజు; పాటలు: పోతుల రవికిరణ్, శ్రీరాం తపస్వీ; డ్యాన్స్; సుచిత్రా చంద్రబోస్, అమ్మ రాజశేఖర్, వేణుపాల్, కిశోర్; మ్యూజిక్: మున్నాకాశి; ఎడిటింగ్; బుల్ రెడ్డి; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఖాదర్; సహనిర్మాతలు: సలామ్, అశోక్; నిర్మాణ సారథ్యం; గాజుల ఖాదర్ భాషా. నిర్మాత: జక్కుల నాగేశ్వరరావు; కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అంజి శ్రీను


Click it and Unblock the Notifications











