twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '1-నేనొక్కడినే' లో 'అమ్మపాట 'విడుదల(లింక్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నిర్మాతలు అమ్మపాట ను ఆన్ లైన్ లో విడుదల చేసారు. సినిమా క్లైమాక్స్ లో మహేష్ బాబు..తన తల్లి తండ్రలకు సంభందించిన క్లూ తెలిసికునే క్లూ కి చెందిన పాట ఇది. ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాట విన్నవారు మరొకసారి సినిమాని గుర్తు చేసుకుని రిపీట్ ఆడియన్స్గ్ గా మారతారని, అలాగే సినిమా చూడని వారికి ఆసక్తి కలుగుతుందని నిర్మాతలు భావించి రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.

    1 - Nenokkadine

    ఆ లింక్..

    ఇక మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో రాక్ స్టార్ గా నటించిన చిత్రం '1-నేనొక్కడినే'. మోడల్ కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఫస్ట్ టైమ్ దేవిశ్రీ ప్రసాద్ మహేష్ సినిమాకు సంగీతం సమకూర్చాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా క్లాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

    సుకుమార్ మాట్లాడుతూ... సినిమాకి అన్ని చోట్ల నుంచీ రిపోర్టూ బాగుంది. విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. క్రమంగా టాక్ పికప్ అయ్యి ఇప్పుడు చాలా బాగుంది. ఓవర్సీస్‌లో మరింత ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది. అక్కడ గ్రాండ్ సక్సెస్. ఒక్కోసారి ఆలోచింపజెయ్యడం కూడా ఆనందకర విషయం అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌కి ఓ రకంగా అది కూడా కారణమే. ఇలాంటి ఆలోచింపజేసే సినిమా షార్ప్‌గా ఉండాలి. అందుకే 20 నిమిషాల నిడివి తగ్గించాం. ఇండస్ట్రీ మొత్తం నుంచి ఈ సినిమాకి సపోర్ట్ వచ్చింది. ఎన్నో కాల్స్ వచ్చాయి. రవితేజ, రామ్, నాని సహా చాలా మంది హీరోలు, రాజమౌళి, పూరి జగన్నాథ్, సురేందర్‌రెడ్డి సహా చాలా మంది డైరెక్టర్లు, చోటా కె. నాయుడు వంటి టెక్నీషియన్లు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. ప్రస్తుతం జర్మన్, ఫ్రెంచి భాషల్లో డబ్బింగ్ చేసే ప్రక్రియ నడుస్తోంది. ఆ తర్వాత మరికొన్ని ప్రపంచ భాషల్లో డబ్ చేయబోతున్నాం అన్నారు.

    English summary
    Mahesh Babu‘s '1 - Nenokkadine' makers are trying their best to promote their film to pull back the crowds to theatres. Earlier the film makers have announced the 'Amma Paata' of the film that comes in as an epilogue will be launched at an event separately. But due to some reasons the film makers have launched the song today in online and social media directly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X