నితిన్‌కు డ్యాన్సే రాదు.. వస్తానని చెప్పి ఇన్సల్ట్ చేశాడు: అమ్మా రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ నితిన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అతను చాలా ఇన్సల్ట్ చేశాడు అని తన సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ చాలా ఎమోషనల్ అవుతూ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అమ్మ రాజశేఖర్ నటించిన హై-ఫైవ్ అనే సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించగా ఆ వేడుకలో అమ్మ రాజశేఖర్ నితిన్ తనను తీవ్రంగా అవమానపరిచాడు అంటూ బాధపడుతూ వివరణ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 దర్శకుడిగా..

దర్శకుడిగా..

మొదట తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా కొనసాగిన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత దర్శకుడుగా మారిన విషయం తెలిసిందే. గోపీచంద్ రణం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన అమ్మా రాజశేఖర్ ఆ తర్వాత రవితేజతో ఖతర్నాక్, నితిన్ తో టక్కరి అనే సినిమా చేశాడు. ఇక తర్వాత దర్శకుడిగానే కాకుండా కథానాయకుడుగా కూడా నటించే ప్రయత్నం చేశాడు. అలాగే బిగ్ బాస్ నాలుగో సీజన్లో కూడా కంటెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.

నితిన్ తో సినిమా

నితిన్ తో సినిమా

యువ హీరో నితిన్ తో అమ్మ రాజశేఖర్ టక్కరి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే అంతకుముందే నితిన్ తో అమ్మ రాజ శేఖర్ కు మంచి పరిచయం ఉంది. మొదట కెరీర్లో అతనికి డాన్స్ కూడా నేర్పించినట్లు తెలియజేశారు.

నితిన్ పై అప్సెట్

నితిన్ పై అప్సెట్

అయితే ఇటీవల హై ఫై సినిమా ఈవెంట్లో అమ్మా రాజశేఖర్ నితిన్ పై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన హైఫై సినిమా సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాదులో నిర్వహించారు. అయితే ఈ సినిమా ఈవెంట్ కు అమ్మా రాజశేఖర్ నితిన్ ను ప్రత్యేకంగా పిలిచినట్లు చెప్పారు. అయితే అతను కావాలని రాలేదు అని ఆ విషయంలో తీవ్రంగా అప్సెట్ అయినట్లు కూడా రాజశేఖర్ తెలియజేశాడు.

ఇన్సల్ట్ చేశాడు

ఇన్సల్ట్ చేశాడు

ఈ ఫంక్షన్ కి రావలసిందిగా 10 రోజుల క్రితమే నితిన్ కు నేను చెప్పడం జరిగింది అతను కూడా వస్తాను అని మాట ఇచ్చాడు దీంతో అతని వస్తున్నాడు అని నమ్మకంతో ప్రత్యేకంగా అన్నం కూడా తినకుండా ఒక AV కూడా రెడీ చేశాను. నితిన్ కు అసలు డాన్స్ కూడా రాదు. అప్పుడు నేను ప్రత్యేకంగా డాన్స్ నేర్పించాను. కానీ ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువుపై గౌరవంతో వస్తాను అని చెప్పి ఇప్పుడు రాకుండా నన్ను ఇన్సల్ట్ చేశాడు.. అని అన్నారు.

వస్తానని చెప్పి..

వస్తానని చెప్పి..

నితిన్ ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ చేసి అడిగినా కూడా రాలేదు. జ్వరంగా ఉంది అని చెప్పాడు. దీంతో నేను వీడియో బైట్ ఇవ్వాలి అని అడిగాను. అది కూడా చేయలేదు. ఈ సంద్భంగా నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. లైఫ్ లో మనం ఏ స్థాయికి వెళ్ళినా కూడా గురువును ఎప్పటికీ మర్చిపోకూడదు. కానీ నితిన్ నువ్వు వస్తానని రాలేదు. రానని చెబితే సరిపోయేది. కానీ వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతగానో అవమానించావు. నాకు చాలా బాధగా ఉంది.. అంటూ అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X