Amma Rajasekhar: హీరో గోపిచంద్ మోసం.. నా కెరీర్ అప్పుడే డౌన్.. దారుణంగా ఏడ్చాను!
డాన్స్ మాస్టర్లుగా చేసి ఆ తర్వాత దర్శకుడుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక అందులో సక్సెస్ అయిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. ఒకప్పుడు అమ్మా రాజశేఖర్ కూడా మొదట డాన్స్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకొని ఆ తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కూడా ఆయన నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్, గోపీచంద్ కూడా మోసం చేసినట్లు చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

మళ్ళీ నిలదొక్కుకోవాలి..
అమ్మ రాజశేఖర్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన తెలుగు బిగ్ బాస్ లో కూడా కనిపించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అప్పుడప్పుడు రియాలిటీ షోలలో కూడా ప్రత్యేక ఆధితిగా వస్తున్నారు. ఇక ప్రస్తుతం డాన్స్ మాస్టర్ గా అలాగే దర్శకుడుగా కూడా మళ్ళీ నిలదొక్కుకోవాలి అని అమ్మా రాజశేఖర్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆయన గతంలో జరిగిన మోసాల గురించి కూడా బయటపెడుతున్నారు.

నితిన్ గురించి..
ఇటీవల తన సినిమా రిలీజ్ ఈవెంట్ కు పిలిచినా నితిన్ రాలేదని చెబుతూ.. అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో నితిన్ పై నెగిటివ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఒకప్పుడు డాన్స్ నేర్పిన గురువుకే మాట తప్పి మోసం చేయడం ఎంతవరకు న్యాయమని అమ్మ రాజశేఖర్ స్టేజ్ పైన చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం ఇంటర్వ్యూలలో కూడా తన కెరీర్ లో జరిగిన మరికొన్ని మోసాల గురించి ఎమోషనల్ అవుతూ వివరణ ఇచ్చారు.
Recommended Video


గోపిచంద్ కూడా
అయితే ఒకానొక సమయంలో హీరో గోపీచంద్ ద్వారా కూడా మోసం జరిగింది అని అమ్మ రాజశేఖర్ తెలియజేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే గోపీచంద్ ఇప్పటివరకు తన సినీ కెరీర్ మొత్తంలో కూడా ఎవరితోనూ పెద్దగా మాట పడింది లేదు. తన సినిమా మాత్రమే చేసుకుంటూ వెళ్లే గోపీచంద్ పై అమ్మ రాజశేఖర్ ఈ విధంగా కామెంట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

వెంకటేష్ తో సినిమా..
రణం సినిమా చేసిన తర్వాత మరొక సినిమా కూడా చేద్దామని హీరో గోపీచంద్ నాతో అన్నాడు. అయితే ఆ క్రమంలోనే ఒక లైన్ గురించి చెప్పాను. అతను తప్పకుండా చేద్దామని అన్నాడు. కానీ నాకు ఆ తర్వాత సురేష్ బాబు ప్రొడక్షన్ నుంచి సినిమా చేసే అవకాశం వచ్చింది హీరో వెంకటేష్ గారు సురేష్ బాబు ఒప్పుకోవడంతో స్పెషల్ సెట్ కూడా వేయడం జరిగింది. అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు.. అని అమ్మా తెలియజేశాడు.

కథ చెబితే మోసం
అయితే వెంకటేష్ గారితో సినిమా మొదలు పెట్టాలి అని అనుకున్న సమయంలోనే హీరో గోపీచంద్ అలాగే సత్యరాజ్ కాంబినేషన్లో ఒక సినిమా (శంఖం) వచ్చింది. ఆ సినిమాలో చూసిన తర్వాత నేను గతంలో గోపీచంద్ కు చెప్పిన కథ అనిపించింది. దీంతో వెంటనే షాక్ అయ్యాను. ఇక నిర్మాత సురేష్ బాబు కూడా ఆ కథ వద్దని మరొక సినిమా చేద్దాము అని అన్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్రాజెక్ట్ సెట్ కాలేదు అని అప్పుడే తను చాలా బాధపడి ఏడ్చాను అని అమ్మా రాజశేఖర్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











