వెంకటేష్ కి భీబత్సం తప్పదా?
కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న వెంకటేష్ కి ఆచితూచి కథలు ఎంపిక చేసుకుంటాడని పేరు. అందుకు తగ్గట్లుగానే చింతకాయల రవి అనంతరం రకరకాల కథలు విన్నారు. అందులో శ్రీను వైట్ల, అమ్మరాజశేఖర్ కథలు ఓకే చేసారు. శ్రీను వైట్ల మినిమం గ్యారెంటీ కాబట్టి ఇబ్బంది లేదు కానీ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో సినిమా అంటేనే డౌటు అంటున్నారు. రణం చిత్రం తర్వాత ఒక్క యావరేజ్ చిత్రం కూడా తీయకుండా వరసగా ఖతర్నాక్, టక్కరి, భీభత్సం అంటూ ప్లాపులిస్తున్న రాజశేఖర్ తో చిత్రం అనేది ఎంత వరకూ సబబు అంటున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ప్లస్ పాయింట్ కోనవెంకట్ స్క్రిప్టు, నల్లమలుపు బుజ్జి నిర్మాణం. చింతకాయల రవి చిత్రం అనంతరం కోనవెంకట్ పై వెంకటేష్ కి గురి కుదరటంతో అతనే స్క్రిప్టు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోనవెంకట్ గత స్క్రిప్టుల తరహాలో ఫన్ తో నడుస్తుందని తెలుస్తోంది. అయితే అమ్మ రాజశేఖర్, వెంకటేష్ కాంబినేషన్ చాలా మందికి రుచించటం లేదు. రాజశేఖర్ ఏ సబ్జెక్టు పట్టుకున్నా దాన్ని కమర్షియల్ పేరుతో అతి చేసి చెడగొడతాడని, హీరోయిన్స్ ని ఎక్సపోజ్ చేయటంలో ఉన్న ఇంట్రస్టు కథ,కథనాలపై చూపడని విమర్శిస్తున్నారు. అంతేగాక అతను తమిళం వాడు కావటంతో అక్కడ ఉండే అరవ అతిని తెచ్చి ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తున్నాడని, ఏదైనా సినిమా రిఫెరెన్స్ లేనిదే ఏమీ చేయలేడని అలాంటి వాడిని ఎంకరేజ్ చేయటం ఏమిటని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో నమో వెంకటేశ చిత్రం కమిటయిన వెంకటేష్ కి ఈ కథ సైతం బాగా నచ్చిందని వినికిడి. ఇవన్నీ ఎలా ఉన్నా చింతకాయిల రవిలా కాకుండా మంచి హిట్ వెంకటేష్ ఇవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











