ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు.. దానికే సూసైడా? అవినాష్‌కు అమ్మ రాజశేఖర్ క్లాస్
బిగ్‌బాస్ ఇంటిలో మార్నింగ్ మస్తీలో భాగంగా అవినాష్, గంగవ్వ చెప్పిన విషయాలపై ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. వారిద్దరికి ఎదురైన విషాదాల గురించి ఇంట్లో చర్చ జరిగింది. కిచెన్‌లో అవినాష్‌తో, గార్డెన్‌లో గంగవ్వతో ఇంటి సభ్యులు ముచ్చటిస్తూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చెప్పారు. అవినాష్, గంగవ్వ గురించి ఇంటి సభ్యులు ఏం చెప్పారంటే..

ఎన్ని కష్టాలు వచ్చినా..
అవినాష్ సూసైడ్ విషయంపై అమ్మా రాజశేఖర్ స్పందిస్తూ.. ఎన్ని కష్టాలు వచ్చినా అలాంటి ప్రయత్నాలు చేయవద్దు. మనం ఎందుకు పుట్టామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకోసారి అలాంటి ప్రయత్నం చేస్తే నేనే చంపేస్తాను అని అమ్మా రాజశేఖర్ అన్నారు.

కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయని అవినాష్
నా జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. కొన్నిసార్లు అలా జరిగిపోతాయి. మన చేతిలో ఏమి ఉండదు అంటే అవినాష్ అంటే.. అరేయ్ అలా మాట్లాడితే నీతో మాట్లాడను. నీవు మనిషివేనా. ప్రతీ ఒక్కరికి కష్టం వస్తుంది. అంత మాత్రాన సూసైడ్ చేసుకొంటావా? అని అవినాష్‌తో అమ్మా రాజశేఖర్ అన్నారు.

తల్లిదండ్రులకు అలాంటి బాధపెట్టొద్దు
లైఫ్‌లో చనిపోవాలనే ఆలోచన రావొద్దు. పెంచిన తల్లిదండ్రులకు అలాంటి బాధను ఇవ్వవద్దు. ఇండస్ట్రీలో ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు అనుభవించాం. అలా అని చచ్చిపోతామా? అలా అయితే రోజు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవాల్సిందే. ఇండస్ట్రీలో ఒక్క రోజులోనే పాపులారిటీ వస్తుందా? కష్టాలను అధిగమిస్తూనే సాధించాలి అని అమ్మా రాజశేఖర్ అన్నారు.

జీవితంలో ఒక్క ఇల్లు కాదు అంటూ అభిజిత్
ఇక అవినాష్‌తో అభిజిత్ మాట్లాడుతూ.. ఒక్క ఇళ్లు కాదు.. చాలా ఇండ్లు కట్టుకోవాలి. ఫ్లాట్ ఉండాలి. ఫామ్ హౌజ్ ఉండాలి. విల్లా ఉండాలి. ప్రతీ రోజు ఒక్కో ఇంట్లో గడపాలి అని అభిజిత్ అన్నాడు. సూసైడ్ గురించి మాట్లాడుతూ.. కష్టాలను వస్తూనే ఉంటాయి. జీవితంలో ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలని అఖిల్ సూచించాడు.
Recommended Video

గంగవ్వ గురించి నోయల్, హారిక
గంగవ్వ గురించి నోయల్ సీన్, హారిక మాట్లాడుకొంటూ కనిపించారు. గంగవ్వ క్యూట్ అంటూ నోయల్ అంటే.. గంగవ్వను బాగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. అయితే చుట్టు అందరూ ఉండటం వల్ల అలా చేయలేకపోతున్నాను. గంగవ్వ అంటే ఓ రకమైన పొసెసివ్ నాకు. అందరూ ఆమెతో ఉండటం వల్ల నేను అవ్వకు దగ్గరకాలేకపోతున్నాను అంటూ హారిక చెప్పింది.


Click it and Unblock the Notifications











