For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగ శౌర్య ‘అమ్మమ్మగారిల్లు’పై పాజిటివ్ బజ్, ఆదిత్య మ్యూజిక్ చేతికి ఆడియో!

  By Bojja Kumar
  |

  చలో సినిమా సక్సెస్ జోష్‌తో హీరో నాగశౌర్య దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు బాలతారగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొన్న బేబి షామిలితో తాజాగా 'అమ్మమ్మగారిల్లు' సినిమా కోసం జతకట్టాడు. శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్‌లో కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

  నిర్మాత‌లు మాట్లాడుతూ, చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌లే సినిమా శాటిలైట్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. ప్ర‌ముఖ జెమిని టీవీ ఛానల్ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను 2.75 కోట్ల‌కు తీసుకుంది. తాజాగా ఆడియో హ‌క్కుల‌ను ఆదిత్య మ్యూజిక్ ద‌క్కించుకుంది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత గా పెరుగుతున్నాయి. ఈనెల 22న టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ కార్య‌క్ర‌మానికి హీరో నాగ శౌర్య , హీరోయిన్ షామిలితో పాటు, మిగ‌తా టీమ్ స‌భ్యులంతా హ‌జ‌రు కానున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

  Ammamma Garillu audio rights acquires by Aditya Music

  ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రం గురించి హీరో నాగ‌శౌర్య గతంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొలిసారి చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రంలో న‌టిస్తున్నారు. షూటింగ్ సమయంలో సెట్‌లో పండ‌గ వాతావార‌ణం నెలకొన్నది. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయ‌త‌లు, అనురాగాలు ఈ చిత్రంలో చూడవచ్చు. కుటుంబంలో ఉండే మ‌నస్ప‌ర్ధ‌లు, ఆవేద‌న తదితర అంశాలను ద‌ర్శకుడు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు అని అన్నాడు.

  హీరోయిన్ షామిలి మాట్లాడుతూ, ఓయ్ సినిమా త‌ర్వాత స‌రైన క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతోనే మ‌రో సినిమా చేయ‌లేదు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ అమ్మమ్మ‌గారిల్లు క‌థ న‌చ్చ‌డంతో సినిమాకు వెంట‌నే ఒప్పుకున్నాను. నా క్యారెక్ట‌రైజేష‌న్ చాలా కొత్త‌గా ఉంటుంది. నాగ‌శౌర్యతో సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. అలాగే ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు.

  ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ.. రిలేష‌న్ నెవెర్ ఎండ్ అనే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని రాసిన క‌థ ఇది. ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి సినిమా. తెర‌పై సినిమా చూస్తున్నంత సేపు ఆడియ‌న్స్ కు థియేట‌ర్ లో ఉన్నామ‌న్నా ఫీలింగ్ కాకుండా పండ‌గ వాతావ‌ర‌ణంలో త‌మ కుటుంబంతో గ‌డుపుతున్న అనుభూతి క‌లుగుతుంది అని చెప్పారు. చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ.. సినిమా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ప్ర‌తీ స‌న్నివేశాన్ని హృద‌యానికి హ‌త్తుకునేలా తెర‌కెక్కించారు. అలాగే నాగ‌శౌర్య న‌ట‌న సినిమాకు హైలైట్ గా ఉంటుంది. న‌ట‌న‌పై ఆయ‌న క‌మిట్ మెంట్..డెడికేష‌న్ చాలా బాగున్నాయి. భ‌విష్య‌త్ లో పెద్ద స్టార్ అవుతాడు. మేము సినిమా నిర్మించి ఎంత అనుభూతి పొందామో....సినిమా చూసిన త‌ర్వాత అంతే అనుభూతి ప్రేక్ష‌కులు పొందుతారు అని అన్నారు.

  English summary
  The strong box office success of Chalo has given a new lease of life for Naga Shaurya’s low lying career. He is now awaiting the release of his upcoming film Ammamma Gari Illu which is set for release this Summer. As per our sources, Ammamma Garillu audio Rights acquires by Aditya Music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X