అమ్మమ్మగారిల్లు ట్రైలర్: హైదరాబాద్‌లో అమ్మాయిలే లేరేంట్రా.. కాకినాడ ఫిగరే కావాలా, కెవ్వు కేక బీట్!
ఛలో వంటి సూపర్ హిట్ తరువాత నాగశౌర్య జోష్ మీద ఉన్నాడు. నాగశౌర్య నటించిన అమ్మమ్మగారిల్లు చిత్రం ఈ శుక్రవారం మే 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. మంచి ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది.
అమ్మమ్మ సెంటిమెంట్ తో ఇప్పటివరకు అనేక చిత్రాలు వచ్చాయి. కానీ కథని ప్రజెంట్ చేసే విధానం, స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తే ఈ తరహా చిత్రాలు ప్రేక్షకులని ఎప్పటికి అలరిస్తూనే ఉంటాయి. అమ్మమ్మగారిల్లు చిత్రం విషయంలో దర్శకుడు సుందర్ సూర్య అదే ఫాలో అయినట్లు ఉన్నారు. ట్రైలర్ లో సెంటిమెంట్ డైలాగులు, కామెడీ పంచ్ లు బాగా పేలాయి. నాగ శౌర్య, హీరోయిన్ షాలిని మధ్య రొమాన్స్ కూడా బాగానే కుదిరినట్లు కనిపిస్తోంది.

కలసి రావాలంటే కూతుర్ని కనాలి.. తెలిసి రావాలంటే కొడుకుని కనాలి అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ లో అమ్మాయిలే లేరేంట్రా.. కాకినాడ ఫిగరే కావాలా అంటూ షాలిని చెప్పే డైలాగ్ బావుంది. ఇక ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ కెవ్వు కేక సాంగ్ బీట్ కు రావు రమేష్ డాన్స్ చేస్తున్న వినోదాత్మక అంశాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











