చెప్పేందుకే అమ్మ రాజశేఖర్ నీతులు
కొరియాగ్రాఫర్ నుండి దర్శకుడిగా ఎదిగి సినిమాల్లో ఆశ్లీలతను గుమ్మరిస్తూ విమర్శల పాలైన వ్యక్తి అమ్మ రాజశేఖర్ . ఆయన ఈ మధ్య ఓ టి.వీ ఛానెల్ లో డాన్స్ పోగ్రాం (రియాల్టి షో)కి న్యాయ నిర్ణేతగా అటెండయ్యాడు. దానిలో పాల్గొనే వాళ్ళు డాన్స్ ల పేరుతో ఆశ్లీలతను ఎంటర్ టైన్ చేస్తున్నారంటూ వారు ధరించిన దుస్తులపై కామెంట్లు చేసాడు. అలా బుద్ది చెప్పటం మంచిదే కాని..మరి మీరు చేస్తున్నదేమిటి .'ఖతర్నాక్', 'టక్కరి' సినిమాల్లో హీరోయిన్ల దుస్తులు, డాన్సుల్లో భంగిమలు వ్యాంప్ లను మరిపించాయే. వాటి సంగతేమిటి. అంటే చెప్పటానికేనా నీతులు. నిజానికి డాన్స్ లలో పాల్గొనే వాళ్ళు చాలా మంది మీలాంటి కొరియాగ్రాఫర్ ల నృత్యాలు చూసి ప్రేరణ పొందేవాళ్ళు. అంటే ఈనాటి ఈ పరిస్థితికి మీరే కారణం అంటూ విరుచుకుపడుతున్నారు ఆయన కామెంట్లు విన్నవాళ్లు.అంటే వాళ్ళని విమర్శించే అర్హత అమ్మ రాజశేఖర్ లేదనేగా వాళ్ళ ఉద్దేశం. కరెక్టే ఒక వేలు ఎదుటి వాడి తప్పు వైపుకు చూపెడితే మన వైపుకు...అదీ సంగతి.


Click it and Unblock the Notifications











