twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివాజీ రాజా ప్రధాన పాత్రలో అమ్మాయిలంతే..అదో టైపు

    శివాజీ రాజా ప్రధాన పాత్రలో అమ్మాయిలంతే..అదో టైపు అనే సినిమా తెరకెక్కుతోంది.

    By Bojja Kumar
    |

    అమ్మాయిల్లోని ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను, తండ్రి తనయల రిలేషన్ హైలెట్ చెస్తూ దర్శ కుడు కృష్ణమ్ రూపొందిస్తొన్న చిత్రం అమ్మాయిలంతే ..అదోటైపు . గోపి వర్మ, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    డిసెంబర్లో విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు కృష్ణమ్ మాట్లాడుతూ ''తను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఓ కూతురు, తన తండ్రి ప్రేమ‌కు దూర‌మ‌వు తుంది. అప్పుడు ఆ అమ్మాయి, తండ్రి ప్రేమకి దూరమయ్యానని పడే బాధ, ఆ తరువాత జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్రం' అని తెలిపారు.

     'Ammayilanthe.. Ado Type' release in december

    సీనియర్ నటులు శివాజీ రాజా ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. తండ్రి పాత్రలో శివాజీ రాజా అద్భుతమైన పాత్ర పోషించారని, ఆయన నటన సినిమాకు హైలెట్ అవుతుందని దర్శకుడు తెలిపారు. డిసెంబర్ లొ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.

    గోపి వర్మ‌, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా, సాయి, భ‌ద్ర‌మ్‌, వేణుగోపాల్‌, భ‌ర‌త్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీనివాస్‌, కూర్పు: గోపి సిందమ్, సాహిత్యంః పూర్ణాచారి, ద‌ర్శ‌కత్వంః కృష్ణ‌మ్.

    English summary
    'Ammayilanthe.. Ado Type', directed by Krishnam, stars Gopi Varma, Malavika Menon and Shivaji Raja in main roles. The film will release in december.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X