twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు హీరో, కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య

    By Bojja Kumar
    |

    Recommended Video

    తెలుగు హీరో, కమెడియన్ విజయ్ ఆత్మహత్య !

    తెలుగు చలన చిత్ర సీమలో ఓ ధృవతార నేలరాలింది. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న హీరో, కమెడియన్, కామెడీ ఆర్టిస్ విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొద్దికాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. సినిమా అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్ లోనయ్యాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. కొద్దికాలంగా చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తున్నది. విజయ్ సాయి ఆకస్మిక మృతితో ఫిలింనగర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

     యూసఫ్‌గూడలో విగతజీవిగా

    యూసఫ్‌గూడలో విగతజీవిగా

    యూసఫ్ గూడలోని తన ప్లాట్‌లో విజయ్ సాయి గత జీవిగా కనిపించాడు. విజయ్ సాయి మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు.

     అమ్మాయిలు.. అబ్బాయిలుతో

    అమ్మాయిలు.. అబ్బాయిలుతో

    అమ్మాయిలు అబ్బాయిలు చిత్రంతో విజయ్ సాయి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బ్యాక్ ప్యాకెట్ అనే చిత్రంలో సోలో హీరోగా నటించారు. ఆ తర్వాత వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ వీపీ అండ్ పీపీ అనే చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌తో కలిసి ఓ హీరోగా నటించారు.

    హీరో నుంచి కమెడియన్‌గా

    హీరో నుంచి కమెడియన్‌గా

    ఆ తర్వాత సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో కెమెడియన్ పాత్రలు పోషించారు. బొమ్మరిల్లు, బృందావనం తదితర చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకొన్నారు. కెరీర్‌ కుదురుకుంటుందనే లోపే ఆత్మహత్యకు పాల్పడటంపై సన్నిహితులు షాక్ గురయ్యారు.

    పిరికివాడు కాదు..

    పిరికివాడు కాదు..

    విజయ్‌ సాయి ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదు. ఇటీవలే కలిసి తన కేరీర్‌పై సంతృప్తిని వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం కలిసినప్పుడు ధీమాగా కనిపించారు అని ఓ సన్నిహితుడు పేర్కొనడం గమనార్హం.

     ఆ సినిమాతో కమెడియన్‌గా పాపులరైన విజయ్ సాయి

    ఆ సినిమాతో కమెడియన్‌గా పాపులరైన విజయ్ సాయి

    స్వాతి కిరణం, నువ్వే కావాలి, వేచి ఉంటా, చిరు జల్లు, యూత్, ఒకరికి ఒకరు, బ్యాక్ ప్యాకెట్, సోగ్గాడు, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రాల్లో విజయ్ సాయి నటించారు. 2004లో వచ్చిన ‘ప్రేమించుకున్నాం పెళ్లికి రండి' సినిమాలో చేసిన కామెడీ సీక్వెన్స్ విజయ్‌ సాయికి మంచి పేరు తెచ్చింది.

     తెలుగులో వరుస అవకాశాలు

    తెలుగులో వరుస అవకాశాలు

    ఆ తర్వాత పార్టీ, బొమ్మరిల్లు, మంత్ర, కొత్త కథ, కరెంట్, మొగుడు కావాలి, నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్, తాజ్ మహల్, అందరి బంధువయా, మంగళ, ఇందుమతి బృందావనం, హాయి హారియగా, డిస్కో, వర ప్రసాద్ పొట్టి ప్రసాద్, దశమి, అల్లు, అపార్ట్‌మెంట్, అలలు, నా ఇష్టం, చుక్కలాంటి అమ్మాయి, అడ్డా, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో, మిస్టర్ మన్మధ, ప్రేమలో ఎబిసి చిత్రాల్లో విజయ్ సాయి అవకాశాలు దక్కించుకున్నాడు.

     తమిళ సినిమాల్లో కూడా...

    తమిళ సినిమాల్లో కూడా...

    తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లో కూడా విజయ్ సాయి నటించారు. 2011లో వచ్చిన ‘పుత్తు కథై' అనే తమిళ సినిమాలో నటించాడు.

    English summary
    Bommarillu & Ammayilu Abbayilu Fame Comedian Vijay is no more. He Committed Suicide at his flat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X