For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్లకు అమ్మాయిలు పడరు.. అందుకే ఆంటీలతో: అమ్మోరు ఫేం సునయన హాట్ కామెంట్స్

  By Manoj
  |

  చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి ప్రవేశించి... చిన్న వయసులోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది సునయన. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న ఆమె... చాలా కాలం పాటు సినిమాలకు దూరమైంది. వివాహం తర్వాత యూబ్యూట్ ఛానెల్ ద్వారా ప్రత్యక్షమై షాకిచ్చింది. ఇక, ఈ మధ్య సినిమాల్లోకి రీఎంట్రీతో సత్తా చాటింది. ఈ క్రమంలోనే పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలాఉండగా, తాజాగా ఆమె ప్రముఖ షోకు గెస్టుగా వచ్చింది. ఈ సందర్భంగా అమ్మాయిలు.. అబ్బాయిలు.. ఆంటీలు అంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం.!

  నిజంగా దేవతే దిగొచ్చిందని అనుకున్నారు

  నిజంగా దేవతే దిగొచ్చిందని అనుకున్నారు

  లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అమ్మోరు' సినిమాలో బాలనటిగా చేసింది సునయన. ఇందులో ఆమె అమ్మవారిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించి పెట్టింది. అంతేకాదు, ఈ సినిమా విడుదలైన సమయంలో ఆమె ఫొటోకు పూజలు కూడా చేసేవారు అప్పటి మహిళా ప్రేక్షకులు.

   ఆమె లిస్ట్ చాలా పెద్దదే.. సడన్‌గా మాయం

  ఆమె లిస్ట్ చాలా పెద్దదే.. సడన్‌గా మాయం

  సునయన చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. అదే సమయంలో దాదాపు 30 సినిమాల్లో నటించారు. అంతేకాదు, పది సీరియల్స్‌లో కూడా లీడ్ రోల్ ప్లే చేశారు. ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్‌ల్లో సైతం నటించి మెప్పించారు. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీ అవుతోన్న సమయంలోనే సినిమాలకు దూరమయ్యారు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆమెను చాలా మిస్సయ్యారు.

   ప్రస్టేటెడ్ ఉమెన్‌గా ఎంట్రీ..... భారీ స్పందన

  ప్రస్టేటెడ్ ఉమెన్‌గా ఎంట్రీ..... భారీ స్పందన

  బాల నటిగా, నటిగా, ఆర్జేగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించిన సునయన.... వివాహం అయిన చాలా రోజులకు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ‘ప్రస్టేటెడ్ ఉమెన్' అనే పేరుతో ఓ సిరీస్‌ను నిర్వహించారు. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ వీడియోలకు విపరీతమైన వ్యూస్ వస్తుండేవి.

  సమంత సినిమాతో రీఎంట్రీ... అదిరిందిగా

  సమంత సినిమాతో రీఎంట్రీ... అదిరిందిగా

  నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం ‘ఓ బేబీ'. హాలీవుడ్ మూవీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం ద్వారా సునయన టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో రాజేంద్రప్రసాద్ కూతురిగా ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. దీంతో సునయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూరీ ఆకాష్ నటిస్తున్న ‘రొమాంటిక్‌'లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

   బిగ్ బాస్‌లోకి సునయన... రోజుకు లక్ష

  బిగ్ బాస్‌లోకి సునయన... రోజుకు లక్ష

  తెలుగులోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరొందిన బిగ్ బాస్‌... ఇటీవలే నాలుగో సీజన్‌ను మొదలెట్టింది. ఇందులో కంటెస్టెంట్‌గా ఉండాలని షో నిర్వహకులు సునయనను సంప్రదించారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆమె అందుకు గానూ రోజుకు రూ. లక్ష డిమాండ్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సునయన మరోసారి వార్తల్లో నిలిచి హాట్ టాపిక్ అయ్యారు.

  Sunaina Roshan's Boyfriend Ruhail Amin Breaks His Silence || Filmibeat Telugu
  అమ్మాయిలు పడరు.. అందుకే ఆంటీలతో

  అమ్మాయిలు పడరు.. అందుకే ఆంటీలతో

  ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘వావ్ 3'లో కౌముది, మంగ్లీ, నిఖిల్‌తో కలిసి పాల్గొన్నారు సునయన. సాయి కుమార్ సారథ్యంలో వస్తున్న ఈ షోలో ఆమె మాట్లాడుతూ ‘అబ్బాయిలు ఆంటీలతోనే చెక్‌అవుట్ చేస్తారు. వాళ్లకు అమ్మాయిలు అంత ఈజీగా పడరు' అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Sunaina Badam is a beloved child artiste, a popular TV host and an RJ. Sunaina Badam is back in the limelight with her new web series, ‘Frustrated Woman’ where she plays the roles of different women in different circumstances.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X