రూ.100 కోట్లు సాధించటం కొలమానం కాదు

మసాలా, ఫార్ములా చిత్రాలకు ఏ మాత్రం వ్యతిరేకిని కాను. కేవలం వంద కోట్ల రూపాయలు రాబట్టుకోవాలనే దృక్పథంతో చిత్రాలను నిర్మించటం తగదని భావిస్తా. రూ.100 కోట్ల బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించి.. అంతేస్థాయిలో వసూళ్లు రాబట్టి చివరకు ఇరానీ, యూరోపియన్ చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడటం తగదన్నారు. ఇరానీ చిత్రాలు రూ.కోటి బడ్జెట్‌తో నిర్మితమైనవేనని గుర్తించాలి.
కళాత్మక చిత్రాలను తీయాలనే దృక్పథం ఉంటే చాలు. మనసు పెడితే సమకాలీన, ప్రాంతీయ, సంస్కృతి ప్రాధాన్యత కల్గిన చిత్రాలను తీయటం ఓ సమస్య కాబోదు. మొత్తం సినిమా కథను రాయటం.. చివరి రెండు లైన్లలో కళాకారుల నటనను వివరించటం.. అదే ఓ సమీక్ష, విమర్శ కాదు. కథల్లో సత్తా ఉన్నంత వరకూ ఎటువంటి సమీక్షలు, విమర్శలు సినిమా వ్యాపారాన్ని అడ్డుకోలేవు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై ఇటీవల ప్రముఖ నేపథ్య గాయని లతామంగేష్కర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించబోను. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు. 45 ఏళ్ల సినీజీవితంలో సాధించిన అనుభవాల్ని కొత్త తరానికి పంచుతా. చిత్రలేఖనం, క్రికెట్ అంటే ప్రాణం. బెంగళూరు నగరం ఎంతోగానో ఆకట్టుకొంది. కర్ణాటకలో చిత్రాలు తీయమని ఎవరైనా అడిగితే ఆనందంగా ఒప్పుకుంటానని అమోల్ పాలేకర్ అన్నారు.


Click it and Unblock the Notifications











