twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలికి దక్కని చోటు: ‘కోర్టు’కు ఆస్కార్ ఎంట్రీ ఛాన్స్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియా నుండి ఆస్కార్ ఎంట్రీకి సినిమా ఎంపిక జరిగింది. 2016లో లాస్‌ఏంజిల్స్‌లో జరిగే 88వ అకాడమీ అవార్డులు(ఆస్కార్) కు ఇండియా నుండి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో పోటీ పడేందుకు మరాఠి చిత్రం ‘కోర్ట్'ను ఎంపిక చేసారు. ప్రముఖ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ నేతృత్వంలోని 17మంది సభ్యుల జ్యూరీ వివిధ చిత్రాల పరిశీలన అనంతరం ఈ చిత్రాన్ని ఎంపిక చేసారు.

    చైతన్య తమ్‌హానె దర్శకత్వంలో తెరకెక్కిత ‘కోర్ట్' చిత్రం ఇప్పటికే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ఈ ఏడాది జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇదే చిత్రాన్ని అమోల్ పాలేకర్ నేతృత్వంలోని 17మంది సభ్యుల జ్యూరీ ఇండియా నుండి ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేయడం విశేషం.

    Amol Palekar and Jury Pick Court as India's Oscar Entry

    ఆస్కార్ ఎంట్రీ కోసం దేశంలోని వివిధ బాషల నుండి పలు సినిమాలు పోటీ పడ్డాయి. టాలీవుడ్ నుంచి రాజమౌళిక్ దర్శకత్వంలో తెరకెక్కి ‘బాహుబలి' సినిమా అఫీషియల్ ఎంట్రీ‌గా వెళ్లిందిం. ఈ సారి దేశం నుండి ఆస్కార్ ఎంట్రీ కోసం దాదాపు 45 సినిమాలు పోటీ పడ్డాయి.

    బాలీవుడ్‌లో‌ని అమీర్ ఖాన్ నటించిన ‘పీకే' చిత్రం, అనురాగ్ కశ్యప్ నటించిన ‘అగ్లీ' , విశాల్ భరద్వాజ్ నటించిన ‘హైదర్', ప్రియాంక చోప్రా నటించినటువంటి ‘మేరీ కొమ్'టో పాటు తమిళంలో బడ్జెట్ సినిమాలు అయినటువంటి ‘కాకముట్టై'. ఇంకా కొన్ని చిత్రాలు పోటీ పడ్డాయి.

    English summary
    The 17-member jury headed by filmmaker Amol Palekar has picked the Marathi language Court as India's entry for Best Foreign Language Film at the Oscars next year. Court, directed by Chaitanye Tamhane making his debut, won this year's National Award for Best Feature Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X