twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎవరినీ కించపరచలేదు' దర్శకుడు వివరణ

    By Srikanya
    |

    చెన్నై: తమ చిత్రంలో ఎవరినీ కించపరిచే సన్నివేశాలులేవని దర్శకుడు ఎ.ఎమ్‌.ఆర్‌.రమేష్‌ అన్నారు. స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'వనయుద్ధం'. వీరప్పన్‌ పాత్రలో కిషోర్‌ నటిస్తున్నాడు. ఆయన్ను ఎన్‌కౌంటర్‌ ద్వారా హతమార్చిన పోలీసు అధికారి విజయకుమార్‌ పాత్రలో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కనిపిస్తాడు. విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఇందులో వాస్తవానికి విరుద్ధంగా పలు సన్నివేశాలు ఉన్నట్లు వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానానికి వెళ్లారు. అయితే సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ కోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది.

    దర్శకుడు మాట్లాడుతూ.. పదకొండేళ్లపాటు పరిశోధనలు జరిపి, 250 మందితో ప్రత్యేకంగా చర్చించిన తర్వాతే కథను సిద్ధం చేసుకున్నాము. వాస్తవాలను విస్మరించలేదు, అదే సమయంలో ప్రత్యేకించి ఎవరినీ కించపరచలేదు. వీరప్పన్‌ భార్య కోర్టుకు వెళ్లటంలో తప్పు లేదు. అది ఆమె హక్కు కూడా. కోర్టు ఉత్తర్వుల మేరకు కొన్ని సన్నివేశాలు తొలగించి సమస్య పరిష్కరించుకున్నాము. సెన్సార్‌బోర్డు 'యూ' సర్టిఫికేట్‌ అందజేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ చిత్రంలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌గా సురేష్‌ఒబరారు, వీరప్పన్‌గా కిషోర్‌, రాజ్‌కుమార్‌ను రక్షించడంలో పోరాడిన పోలీసు అధికారి విజయకుమార్‌ పాత్రను అర్జున్‌ పోషించారు.

    ఈ చిత్రంపై విధించిన నిషేధాన్ని హైకోర్టు తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ చిత్రం ఈ నెల 15న విడుదలకు సిద్ధం అవుతోంది. కుప్పి, కాదలర్ కుడియిరుప్పు వంటి వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిం చిన దర్శకుడు ఎంఆర్ రమేష్ తాజాగా రూపొం దిస్తున్న చిత్రం వనయుద్ధం. గంధపు స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రం లో అర్జున్, కిషోర్, విజయలక్ష్మి, జయచిత్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమైంది. ఈ చిత్రం విడుదలపై గం ధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు వనయుద్ధం చిత్రంపై తాత్కాలిక స్టేను విధించింది. ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ చిత్ర దర్శక నిర్మాత హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇందులో ఆయన తరపు న్యాయవాది ఎ.నటరాజన్ హాజరై వీరప్పన్ గురించి ప్రచారమైన వార్తలను ఇతివృత్తంగా తీసుకుని వనయుద్ధం చిత్రాన్ని తెరకెక్కించామని పేర్కొన్నారు.

    Vana Yuddham

    తన కుటుంబానికి వనయుద్ధం వల్ల కళంకం ఏర్పడుతుందనే ముత్తులక్ష్మి వాదన సరైంది కాదన్నారు. ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రామనాథన్ కింది కోర్టులో విధించిన నిషేధాన్ని తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అభ్యంతరం తెలిపిన సన్నివేశాలను వనయుద్ధం చిత్రం నుంచి తొలగించడానికి దర్శక నిర్మాత సమ్మతించారని తెలిపారు. దీంతో చిత్రంపై నిషేధం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వనయుద్ధం చిత్రా న్ని ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఏఎంఆర్ రమేష్ తెలిపారు.

    English summary
    AMR Ramesh, the director of Vana Yuddham, an upcoming biopic on notorious forest brigand Veerappan, summoned a press meet today, 5th February 2013, to officially announce the release date of his film. After being surrounded by controversies for a long time, the ban on the film was lifted by the High Court recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X