ఆ చిత్రమంటే అమృతకు ఎంతో ఇష్టమట!
రసిక శిఖామణి ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ దృష్టిలో పడిన తాజా హీరోయిన్ అమృతారావు. అంతకుముందు ఆయన అభిమాన హీరోయిన్ గజగామిని మాధురీ దీక్షిత్. మాధురీ దీక్షిత్ స్థానాన్నిపుడు అమృతారావు ఆక్రమించింది. వివాహ్ సినిమా చూసిన తరువాత నుంచీ ఎంఎఫ్ హుసేన్ టేస్ట్ లో వచ్చిన మార్పు.
ఇదిఇలా ఉంటే ఆయన చూపిస్తున్న అభిమానానికి ఉబ్బితబ్బిబ్బు అవుతోంది అమృతారావు. ఆయనగారు వేస్తున్న ఈమె బొమ్మలు కాన్వాస్ మీద చూసుకొని మైమరిచిపోతోందట. ఆయన బహుకరించిన శ్రీకృష్ణుని బొమ్మని చూసుకొని అమృతారావు మురిసిపోతోందట. ఆ చిత్రమంటే ఆమెకు ఎంతో ఇష్టమట.


Click it and Unblock the Notifications











