రామ్ చరణ్ రెండో హీరోయిన్ ఎవరు?
రామ్ చరణ్ హీరోగా రాజమౌళి సినిమా కొత్త సంవత్సరంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ పని ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను డిసెంబర్ చివరి వారంలో ప్రకటించవచ్చని సమాచారం. ఇప్పటికే చిరంజీవికి కథ వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగాయి. స్క్రిప్ట్ పని మరో 20 రోజుల్లో పూర్తికావచ్చని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపికే మిగిలిపోయింది. రాజమౌళి ఓం శాంతి ఓం సినిమా ఫేం దీపికా పడుకొనేను సంప్రదించగా ఆమెకున్న బిజీ షెడ్యూల్ మూలంగా సాధ్యం కాలేదని తెలుస్తోంది. అతిథి ఫేం అమృతారావును కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ కు నగ్నంగా ఫోజులిచ్చిన కంగనా రనౌత్ ను కూడా రాజమౌళి సంప్రదించినట్టు సమాచారం. చివరికి ఎవరు రామ్ చరణ్ హీరోయిన్ అవుతారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











