ప్రేమలో పడ్డ అమృతారావు???
మహేష్ బాబుకు అర్థరాత్రుల్లు ఫోన్లేమిటని ఆ మధ్య నమ్రత శిరోద్కర్ అమృతారావుకు క్లాస్ పీకిందని పుకార్లు వచ్చాయి. అయితే అమృతారావు నిజంగానే ప్రేమలో పడిందని కొత్త పుకార్లు వస్తున్నాయి. ఆ మధ్య షాహిద్ కపూర్ తో రాసుకుపూసుకు తిరిగిందని వార్తలు వచ్చినా పట్టించుకోని అమృతారావు తాజాగా మరో కొత్త హీరోతో ప్రేమలో పడిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఎలాంటి పుకార్లు వచ్చినా వాటినేమీ పట్టించుకోనని అమృతా ధీమాగా చెబుతోంది. అతిథి సినిమాతో మహేష్ బాబులాంటి హీరో ప్రశంసలు పొందిన అమృత ఇవన్నీ పట్టించుకు కూర్చుంటే కష్టమే కాబట్టి టేకిట్ ఈజీ పాలసీని ఫాలో అవుతున్నట్టుంది.


Click it and Unblock the Notifications











