'అతిధి' గా తెలుగు వారికి పరిచయమైన అమృతారావ్ ప్రేమ వార్తలతో బాలివుడ్ వేడిక్కిపోతోంది. పాకిస్ఠాన్ పాప్ స్టార్ గోహార్‌తో ఆమె ప్రారంభించిన ప్రేమ వ్యవహారం స్పీడు అందుకుందని త్వరలోనే ఏదైనా శుభవార్త వెలువడ వవచ్చునని అంటున్నారు. అమృతారావ్ మెదట్లో 'ఇష్క్ విష్క్' లో తనతో నటించిన షాహిద్ కపూర్ తో జత కట్టిందంటూ వార్తలు వచ్చాయి. 'వివాహ్' హిట్టు తో అవి మరింత బల పడ్డాయి.కాని ఊహించని విధంగా ప్రారంభమయిన ఈ ఎల్లలు దాటిన ప్రేమ కధ స్టార్ట్ అయింది. అది ఈ మధ్య ముంబాయిలో గోహర్ మ్యూజిక్ ఆల్బమ్ 'లవ్ స్పార్కింగ్' విడుదల సమయంలో నిర్ధారణ అయింది. అమృత కార్యక్రమం అయ్యేంతవరకూ ప్రతీక్షణం గోహర్ వెంటే ఉంది. దాంతో ఏంటి విషయం అంటూ మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సిగ్గుపడుతూ చెప్పింది. దాంతో వాళ్ళు నవ్వుకుంటూ 'అవునంటే కాదనిలే ...ఆడవారి మాటలకు అర్దాలే వేరులే' అని పాడుకుంటూ వెళ్ళిపోయారట.