దిల్ రాజు చేతిలో మహేష్ బాబు హీరోయిన్ అదృష్టం....
మహేష్ బాబు సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన అందాల 'అతిథి" అమృతారావు ఆ చిత్రంతో మంచి పేరే తెచ్చుకుంది. అయితే సినిమా పరాజయం పాలవడంతో అమృత తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయింది. ఇంతదాకా మళ్లీ ఆమెను తీసుకునే ప్రయత్నాలను మన నిర్మాతలెవరూ చేయలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాలేకపోయినా అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తూ దర్శనమితస్తున్న అమృతారావు తెలుగులో సరయిన బ్రేక్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. ఫైనల్ గా ఆ కబురు రానే వచ్చింది.
దిల్ రాజు నిర్మించే ఓ చిత్రంలో నటించేందుకు అమృతారావు ఫైనలైజ్ అయిందని వార్తలొస్తున్నాయి. సిద్దార్థ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందే చిత్రంతో అమృతారావు తెలుగునాట రీఎంట్రీ ఇస్తోంది. వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకడు వహిస్తున్న ఈ చిత్రంలో మొదట త్రిషని కథానాయికగా తీసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా"కాంబినేషన్ ని రిపీట్ చేసినట్టుంటుందని ప్లాన్ చేసుకున్నారు. అయితే త్రిష డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అమృత చేతికెళ్లింది. ఆమె అదృష్టం దిల్ రాజు చేతిలో ఉందో లేదో చూద్దాం మరి.


Click it and Unblock the Notifications











