అమృత వేషాలు అక్కడ నడవలేదు!!!
అమృతారావు మారువేషాలు నడవలేదు. అక్కడివారు ఆమెను గుర్తుపట్టి గుమిగూడారు. గుంపు ఎక్కువవుతుండడంతో లాభం లేదని గ్రహించిన అమృతారావు మళ్లీ వచ్చిన దారిలోనే వెనక్కు వచ్చేసింది.
మరిన్ని వివరాలలోకి వెళితే...సంప్రదాయ షాపింగ్ కు హైదరాబాద్ లోని చార్మినార్ పెట్టింది పేరు. గాజుల గలలు వినాలంటే చుడీబజార్ వెళ్లాల్సిందే. ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన నవాబుల హైదరాబాద్ లో షాపింగ్ చేయాలని ఎవరికి ఉండదు. అతిథిలో నటించిన అమృతారావు కూడా అతీతం కాదు. అందుకే సన్ గ్లాసెస్ పెట్టి పోనీ టెయిల్ కట్టి ఫ్రెండ్స్ తో కలిసి చార్మినార్ వద్ద కారు దిగింది. బుర్కా కూడా వేసుకుంది. ఎవరూ గుర్తుపట్టరనుకుంది. కానీ అతిథి సినిమాలో ఈవిడగారూ చూపించిన గారాలు ఎవరు మరిచిపోగలరు. గుర్తుపట్టేసారు. గుమి గూడారు. దీనితో షాపింగ్ చేయకుండానే వెనుదిరిగింది.


Click it and Unblock the Notifications











