twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్కడైనా ఉండు.. ప్రాణాలతో ఉంటే చాలు.. జయలలిత నోట షాకింగ్ మాట..

    By Rajababu
    |

    Recommended Video

    జయలలిత నోట షాకింగ్ మాట..ఇదే !

    అలనాటి సినీ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలతి కూతురు అమృత వ్యవహారం ఆసక్తిగా మారింది. తాను జయలలిత కూతురునని ఆమె బలంగా చెప్పుతుండటంతో మీడియాలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన అమృత వెల్లడిస్తున్న విషయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఇటీవల అమృత మీడియాకు వెల్లడించిన విషయాలు మరింత వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి.

    జయలలిత కుమార్తెననే వాస్తవం

    జయలలిత కుమార్తెననే వాస్తవం

    జయలలిత కుమార్తెననే వాస్తవం ఇటీవలే నాకు తెలిసింది. ఈ విషయాన్నిపూర్తిగా ధ్రువీకరించుకున్న తర్వాతే పిటిషన్ దాఖలు చేశాను. నా పెంపుడు తల్లి లలిత 2015లో మరణించింది. అప్పటి వరకు ఆమె కూతురుననే భావించాను. నా పెంపుడు తండ్రి సారథి 2017లో మరణించాడు. మరణానికి ముందు తాను జయలలిత కుమార్తెను అని ఆయన చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

     నాకే అనుమానం వచ్చింది..

    నాకే అనుమానం వచ్చింది..

    జయలలిత కుమార్తె అనే విషయంపై తొలుత నాకే అనేక అనుమానాలు తలెత్తాయి. నా బంధువులు, సన్నిహితులు చెప్పిన విషయాలతో తాను జయలలిత కుమార్తెను అనే విషయం స్పష్టం అయింది. అన్ని విషయాలు విచారించుకొన్న తర్వాతే ఈ విషయాన్ని బహిర్గతం చేశాను అని అమృత వెల్లడింది.

     తొలిసారి జయలలితను కలిశాను

    తొలిసారి జయలలితను కలిశాను

    1996 జూన్‌ 6న తొలిసారి జయలలితను కలిశాను. ఆ సమయంలో ఆమె అధికారం కోల్పోయి మానసిక ఒత్తిడిలో ఉన్నారు. తనను చూసిన వెంటనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ కళ్ల ముందే కనిపిస్తుంది. ఆ తర్వాత జయలలితను పలుమార్లు కలిశాను అని అమృత వెల్లడించారు.

    ఒకే పళ్లెంలో తిన్నాం.. ఒకే పడకపై

    ఒకే పళ్లెంలో తిన్నాం.. ఒకే పడకపై

    జయలలితను కలిసిన ప్రతీసారి ఒకే పళ్లెంలో తిన్నాం. ఒకే పడకపై నిద్రించాం అని అమృత గుర్తు చేసుకొన్నారు. ఆ తర్వాత సచివాలయంలో కలిసిన ప్రతీసారి ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు' అని జయలలిత నాతో అనేవారు. ఆమె ఆస్పత్రిలో చేరడానికి ముందు ఫోన్‌ చేసి చూడటానికి నేను వస్తున్నట్టు చెబితే వద్దని వారించారు. అయినా తాను పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయానికి వెళ్లగా ఆమె లేరు అని సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత విచారించగా ఆమెకు ఇంట్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు తెలిసింది అని అమృత వివరించారు.

    జయలలితను పలుమార్లు కలిశాను

    జయలలితను పలుమార్లు కలిశాను

    జయలలితను పలుమార్లు కలిసినందున దానికి ఆధారంగా సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు ఉండే అవకాశం ఉంది. జయలలిత జెడ్‌ కేటగిరీ ఉన్నందున తన కలిసిన వివరాలు రిజిస్ట్రర్‌లోనూ ఉంటాయి. కావాలంటే ఆ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు అని అమృత పేర్కొన్నది.

     డీఎన్‌ఏ పరీక్ష ద్వారా

    డీఎన్‌ఏ పరీక్ష ద్వారా

    జయలలిత సోదరినని, డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమంటూ తన పెంపుడు తల్లి లలిత గతంలో తెరపైకి వచ్చారు. అలాగే తాను కూడా డీఎన్‌ఏ పరీక్ష ద్వారా జయలలిత కుమార్తెనని నిరూపించుకొంటాను. జయలలిత మరణించడానికి ముందుగా స్పృహలో ఉంటే కచ్చితంగా తనతో మాట్లాడి ఉండేవారు. శశికళ కుటుంబ సభ్యులు తమను జయలలితను కలవకుండా పలుమార్లు అడ్డుకున్నారు అని అమృత ఆరోపించింది.

     శోభన్‌బాబు, జయలలితకు పుట్టాను

    శోభన్‌బాబు, జయలలితకు పుట్టాను

    దివంగత సినీనటుడు శోభన్‌బాబు, జయలలిత దాంపత్య ఫలితంగానే తాను జన్మించానని అమృత చెబుతున్న నేపథ్యంలో జయ, శోభన్‌బాబు మధ్య బంధం మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాకుండా జయ, ఎంజీఆర్ మధ్య ఉండే సన్నిహిత సంబంధాలు మరో తెరపైకి వస్తున్నాయి.

    English summary
    fter one year of Jayalalithaa's death, a Bangalore-based woman Amrutha has claimed that she was born to the late Tamil Nadu Chief Minister. And she petitioned the Supreme Court calling for a DNA test after exhuming Jayalalithaa’s body from its resting place. The apex court dismissed the case and asked her to approach the high court. In this situation, Amrutha revealed so many facts to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X