అమృతం మూవీ: స్పేస్ సూట్లకు భారీగా ఖర్చు
హైదరాబాద్: జస్ట్ ఎల్లో మీడియా ప్రై.లి. పతాకంపై గంగరాజు గుణ్ణం దర్శకత్వంలో ఊర్మిళ గుణ్ణం నిర్మించిన ' అమృతం చందమామలో'. బుల్లితెరపై హిట్టయిన కామెడీ సీరియల్ 'అమృతం'కు కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సినిమాను మే 9న విడుదల చేస్తున్న సందర్భంగా గుణ్ణం గంగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
గంగరాజు మాట్లాడుతూ...సీరియల్ ని సినిమాగా తీయడం చాలా అరుదు. కానీ మేము అనుకున్న చందమామలో కాన్సెప్ట్ సీరియల్ కి సరిపోదని, అలాగే ఖర్చు ఎక్కువ అవుతుందని సినిమాగా తీసాం. అమృతం సీరియల్ లోని అంశాలేవీ ఇందులో ఉండవు, కేవలం అందులో నటించిన పాత్రలు మాత్రమే ఉంటాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్పేస్ సూట్స్ తయారు చేయించారు. ఒక్కోదాని కోసం 35 వేలు ఖర్చు పెట్టి 25 సూట్స్ తయారు చేసాం' అన్నారు.

'అంతరిక్ష నేపథ్యంలో కామెడీని జోడించి తీసిన ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అంతరిక్షంపై పూర్తి నిడివితో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పటి వరకూ చూడని మరో ప్రపంచంలోకి ప్రేక్షకులను ఈ సినిమా తీసుకెళుతుంది. ముఖ్యంగా పిల్లలను ఎంటర్‌టైన్‌మెంట్ చేసే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి' అన్నారు.
అవసరాల శ్రీనివాస్, శివన్నారాయణ, హరీష్, వాసు ఇంటూరి, ధన్య, సుచిత్ర, ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్, కృష్ణమోహన్, ఎల్‌బి.శ్రీరామ్, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : రసూల్ ఎల్లోర్, సంగీతం : శ్రీ, ఎడిటింగ్ : ధర్మేంధ్ర, పాటలు : అనంత శ్రీరామ్, రచన్, నిర్మాత, దర్శకత్వం : గుణ్ణం గంగరాజు.


Click it and Unblock the Notifications











