వెరైటీగా....‘అమృతం-చందమామలో’ (పోస్టర్స్)

By Bojja Kumar

హైదరాబాద్: జస్ట్ ఎల్లో మీడియా ప్రై. లిమిటెడ్ తెరకెక్కిస్తున్న సినిమా 'అమృతం చందమామలో'. అవసరాల శ్రీనివాస్, హరీష్ కోయలగుండ్ల, వాసు ఇంటూరి, శివన్నారాయణ, ధన్య, సుచిత్ర కీలక పాత్రధారులు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసారు. ఈ పోస్టర్లు చూస్తే సినిమా ఎంత వెరైటీగా ఉంటుందో అర్థమవుతోంది.

ఈ సినిమా గురించి గుణ్ణం గంగరాజు ఆ మధ్య విలేకరులతో మాట్లాడుతూ "అమృతం సీరియల్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఆరేళ్లపాటు వారానికి ఒకసారి నిర్విరామంగా ఆ సీరియల్‌ను ప్రసారం చేశాం. ఇప్పుడు రీ టెలికాస్ట్ అవుతోంది. అంటే దాదాపు 12 ఏళ్లుగా ఆ సీరియల్‌ను చూస్త్తూనే ఉన్నారు. 300 ఎపిసోడ్లకు పైగానే చేశాం. అంతకన్నా ఏం చేస్తామనుకుని ఆపేశాం. 'అమృతం'ను ఎక్కడైతే ఆపామో, అక్కడే 'అమృతం చందమామలో' సినిమాను మొదలుపెట్టామని తెలిపారు.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, పోస్టర్లు స్లైడ్ షోలో......

వినోద ప్రధానంగా...

వినోద ప్రధానంగా...

ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుంది. సినిమాలోని చమత్కారాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

కెమెరా వర్క్, గ్రాఫిక్స్ కీలకంగా...

కెమెరా వర్క్, గ్రాఫిక్స్ కీలకంగా...

ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు రసూల్ హీరో అయితే, గ్రాఫిక్స్ హీరోయిన్ అవుతాయి. చాలా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఈ తరహా సినిమాల్లో ఇది గొప్పగా ఉండాలని తెరకెక్కించామని గుణ్ణ గంగరాజు తెలిపారు.

అన్నీ హైలెట్సే...

అన్నీ హైలెట్సే...

స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ టైటిల్స్ వరకు అన్నీ ఈ సినిమాలో హైలైట్లే. చాలా రిస్క్ చేసి ఈ ప్రాజెక్ట్‌ను చేశామని గుణ్ణం గంగరాజు తెలిపారు.

సీక్వెల్ కూడా వస్తోంది

సీక్వెల్ కూడా వస్తోంది

ఈ సినిమాకు సీక్వెల్స్ చేసే ఆలోచనల్లోనూ ఉన్నాం. 'అమృతం కంచుకోటలో' అనే కథ మైండ్‌లో ఉంది అని గుణ్ణం గంగరాజు తెలిపారు.

మే 17న విడుదల

మే 17న విడుదల

'అమృతం చందమామలో' సినిమాను మే 17వ తేదీన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతరిక్షం నేపథ్యంలో

అంతరిక్షం నేపథ్యంలో

‘అంతరిక్ష నేపథ్యంలో కామెడీని జోడించి తీసిన ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ ఇది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అంతరిక్షంపై పూర్తి నిడివితో తెరకెక్కిన చిత్రమిది.

ప్రత్యేకంగా స్పేస్ సూట్స్

ప్రత్యేకంగా స్పేస్ సూట్స్

ఈ సినిమా కోసం ప్రత్యేకంగా స్పేస్ సూట్స్ తయారు చేయించారు. ఒక్కోదాని కోసం 35 వేలు ఖర్చు పెట్టి 25 సూట్స్ తయారు చేయించారు.

నటీనటులు

నటీనటులు

చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, రావు రమేష్, అశోక్ కుమార్ ఇతర పాత్రధారులు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ సినిమాకు కథ: గంగరాజు గుణ్ణం, వాసు ఇంటూరి, పాటలు: అనంతశ్రీరామ్, నృత్యాలు: విజయ్, ఫైట్స్: కింగ్ సాలమన్, ఆర్ట్: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీ, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, కెమెరా: రసూల్ ఎల్లోర్, గ్రాఫిక్స్: ఈసీఎస్, లాఫింగ్ డాట్స్, నిర్మాత: ఊర్మిళ గుణ్ణం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X